మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయం : ఎమ్మెల్యే బాలూనాయక్ 

డిండి, వెలుగు : మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులో చేప పిల్లలను ఆయన వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెరువుల్లో నాసిరకం చేప పిల్లలను వదిలితే సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం ప్రభుత్వ ఐటీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్​మెంట్​భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో దేవరకొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జమునామాధవరెడ్డి, తహసీల్దార్ ఆంజనేయులు, ఎఫ్డీవో మారయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు  దొంతినేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేశ్ రెడ్డి, మత్స్యశాఖ సొసైటీ చైర్మన్ కాశన్న, నాయకులు నూకం వెంకటేశ్, రామ్ కిరణ్, విష్ణువర్ధన్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, శైలేష్ తదితరులు పాల్గొన్నారు. 

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

దేవరకొండ, డిండి, వెలుగు : చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే బాలూనాయక్ విద్యార్థులకు సూచించారు. సోమవారం డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో జోనల్ స్థాయి క్రీడా పోటీలను జ్యోతిప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. అంతకుముందు మండల పరిధిలోని జాల్ తండా నుంచి సోమ్ల తండా వరకు నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.