కార్తీకమాసం అన్ని మాసములలో, అత్యంత పవిత్రమైనదిగా భావించ బడుతున్నది. ‘న కార్తీక సమో మాస’ అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్ధం. కార్తీక మాసం ఏకాదశి ఫలితాలను త్వరగా పొందాలంటే.. మీ కోరికలన్నీ నెరవేరాలంటే పండితులు ఏమంటున్నారో ..దీనికి సంబంధించిన ముఖ్యమైన నియమాలను తప్పక తెలుసుకోవాలి. ఈ ఏడాది రేపు ( నవంబర్ 23) దేవశయని రోజున ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకుందాం.
ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి ( నవంబర్ 23) రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అదేరోజు విష్ణువు తిరిగి సృష్టిని తిరిగి చేపట్టాడని.. నమ్మకం. అందుకనే.. కార్తీక ఏకాదశి నుంచి తిరిగి వివాహాదికార్యక్రమాలు, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు చేపడతారు. అయితే మిగతా ఏకాదశిల కంటే ఈ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భక్తుల విశ్వాసం. ఈ రోజున ఉపవాసం దీక్ష చేసేవారు స్వర్గానికి చేరుకుంటారని .. శ్రీ మహావిష్ణువు కొలువైన వైకుంఠాన్ని పొందుతారని నమ్మకం.
హిందూ మతంలో ఏకాదశి తిథికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశులు శుభకరం అని భావిస్తారు. అయితే ఒకొక్క ఏకాదశికి ఒకొక్క విశిష్టత ఉంది. మంగళకరమైన కార్తీకమాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం. అయితే ఈ కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు.
ఉత్థాన ఏకాదశి నాడు ( నవంబర్ 23)చేయాల్సిన పనులు, పాటించాల్సిన నియమాలు
- ఉత్థాన ఏకాదశి రోజున ( నవంబర్ 23) సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఉపవాస వ్రతం చేపట్టాలి.
- దేవుత్తని ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువుకు తెల్లని పదార్ధాలను నైవేద్యాలు సమర్పించండి.
- ఈ రోజున ఖీర్ లేదా ఏదైనా తెలుపు రంగు మిఠాయిలను సమర్పించండి. విష్ణువుకి తెల్లని పదార్ధాలు అంటే ఇష్టం.. కనుక భక్తులపై అనుగ్రహం కురిపిస్తాడు.
- ఈ రోజున నిర్జల ఉపవాసం ఉంచడం వల్ల విష్ణువు సంతసించి కోరిన కోర్కెలు తీరుస్తాడు.
దేవుత్తని ఏకాదశి ( నవంబర్ 23)నాడు చేయకూడని పనులు
- దేవుత్తని ఏకాదశి రోజున అన్నం పొరపాటున కూడా తినకూడదు.
- ఏకాదశి వ్రతం పాటించే వ్యక్తి ముందు రోజు సాయంత్రం నుంచి అన్నం తీసుకోవడం మానేయాలి.
- ఉపవాస సమయంలో ఎవరిపైనా ద్వేషం లేకుండా చూసుకోండి.
- ఈ రోజున, వృద్ధులకు సహాయం చేయడం ద్వారా లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
- దేవుత్తని ఏకాదశి రోజున తులసి మాతకు శాలిగ్రామంకు వివాహం కార్యక్రమం నిర్వహించండి.
- ఏకాదశి రోజున తులసిని పూజించడం మరచిపోవద్దు
- ఈ రోజున ఇంట్లో కానీ, బయట కానీ ఎవరితోనూ గొడవ పడకూడదు. లక్ష్మీదేవి కోపానికి గురవుతారని నమ్మకం.
- దేవుత్తని ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉండకపోయినా, సాత్విక ఆహారాన్ని మాత్రమే తినడానికి ప్రయత్నించండి.
- ఈ రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలకు దూరంగా ఉండండి