Good Health: ఉదయాన్నే ఈ పనులు చేయండి.. కాలేయం, కిడ్నీలు క్లీన్ అయిపోతాయ్!

మానవ శరీరంలో కాలేయం, కిడ్నీలు ఎంతో ముఖ్యమైన అవయవాలు. ఇవి మన శరీరం నుండి హానికరమైన పదార్థాలను తొలగించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. కాలేయం మన శరీరంలోని బ్యాక్టీరియాను ఫిల్టర్‌ చేసి ఆహారాన్ని సులభంగా అరిగించేలా సహాయపడుతుంది.

 మూత్రపిండాలు రక్తంలోని వ్యర్థ పదార్థాలను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అయితే లివర్, కిడ్నీలు మన శరీరంలోని మలినాలను బయటకు పంపించి, బాడీని శుద్ధి (Detoxification) చేస్తాయి.అయితే ఇంతటి ముఖ్యమైన విధులు నిర్వర్తించే కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకు రోజూ పొద్దున్నే కొన్ని డిటాక్స్ టిప్స్ పాటించాలి. అవేంటో చూద్దాం.

 గోరు వెచ్చని నీటితో నిమ్మరసం:  విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే నిమ్మరసంతో మీ రోజును ప్రారంభించండి. రోజూ పొద్దున్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే, బాడీలోని టాక్సిన్ బయటకు పోతాయి. ఈ డ్రింక్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, కాలేయం, మూత్రపిండాల పనితీరును పెంచుతుంది. నీటి వెచ్చదనం జీర్ణక్రియలో సహాయపడుతుంది .  ఇంకా  శరీరం హైడ్రేట్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

వ్యాయామం :  మెరుగైన ఆరోగ్యానికి ఉదయాన్నే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కార్డియో, శ్వాస వ్యాయామాలు అవయవాలను శుభ్రం చేస్తాయి. వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరిచి జీర్ణక్రియను బ్యాలెన్స్ చేస్తూ, టాక్సిన్స్ అన్నింటినీ తొలగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణను పెంచుతుంది. అలాగే కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతి రోజూ ఉదయం యోగా చేస్తే కాలేయం, కిడ్నీలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి.

హైడ్రేటెడ్‌గా ఉండటం: ప్రతిరోజూ నిద్ర లేవగానే రెండు గ్లాసుల నీరు తాగండి. మీ మెదడు నుండి కాలేయం వరకు అన్ని అవయవాలు సక్రమంగా పని చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు, శరీరానికి అనవసరమైన పదార్థాల విసర్జనకు సహాయపడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఫిల్టర్ చేయడంలో నీరు కీలకంగా పనిచేస్తుంది. అందుకే, పురుషులు ప్రతిరోజూ ఉదయం దాదాపు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగితే రోజంతా చురుగ్గా పనిచేస్తారని వైద్యులు చెబుతున్నారు.

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్  : ఉదయం తినే ఆహారమే మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాలు ఉండేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం వల్ల మూత్రపిండాలు, కాలేయం బాగా పని చేస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించే వెల్లుల్లి, పసుపు, కూరగాయలు వంటి ఆహారాలను డైట్‌లో భాగం చేసుకోండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ద్రాక్ష, క్రాన్బెర్రీస్ వంటి పండ్లు తినండి. వోట్మీల్, పండ్లు మరియు గింజలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోండి. ఇవి మూత్రపిండాలు, కాలేయంను రక్షిస్తాయి. ఈ ఆహారాలు జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి.

కాఫీ.. టీ మానేయండి : ఉదయాన్నే కాఫీ, టీ, చక్కెర తో తయారు చేసే పానీయాలను తాగడం తగ్గిస్తే ..  కాలేయం ..  మూత్రపిండాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పానీయాలు మీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి  వీటికి  బదులుగా, నీరు లేదా హెర్బల్ టీలను తాగండి.

 డీప్ బ్రీతింగ్ లేదా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి : ఒత్తిడి..  కాలేయం మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడటానికి లోతైన శ్వాస లేదా ధ్యానాన్ని సాధన చేయడానికి కొన్ని నిమిషాలు గడపండి.

రోజూ  ఈ  సాధారణ అలవాట్లను  పాటిస్తే.... మీ మూత్రపిండాలు ...  కాలేయం  పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యంలో ఎన్నో మార్పులను తీసుకువస్తాయి.