సౌండ్ బాత్ గురించి విన్నారా?... ఒత్తిడిని చిటికెలో మాయం చేస్తుంది..

మారుతున్న మన లైఫ్ స్టైల్ కారణంగా మనలో ఎక్కువ శాతం మంది నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించటానికి కొంతమంది యోగా, మెడిటేషన్ వంటివి ఫాలో అవుతుంటారు. అయితే, వాటి వల్ల అనుకున్నంత త్వరగా సమస్య పరిష్కారం కాదు. యోగా, మెడిటేషన్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే టెక్నీక్ ఒకటుంది, అదే సౌండ్ బాత్. ఈ మధ్య కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

సౌండ్ బాత్.. వినసొంపైన సంగీతాన్ని అందించే పరికరాలను ప్లే చేయడం ద్వారా చేసే ధ్యాన అభ్యసనం.ఓ చికిత్సా విధానం. గాంగ్స్, ట్యూనింగ్ ఫోర్కులు,క్రిస్టల్ బౌల్స్ వంటి విభిన్న సాధనాల ద్వారా వచ్చే శబ్ధ తరంగాల మధ్య స్నానం చేయడం. ఈ శబ్ధ తరంగాల ద్వారా మనస్సు రిలాక్స్ స్థితిలో వెళ్లి మానసిక ప్రశాంతతను  అందిస్తుందని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ విషయాన్ని కొన్ని అధ్యయనాలు స్పష్టం ఇది ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసేందుకు సాయపడుతుంది. సౌండ్ బాత్ విశ్రాంతినివ్వడమే కాకుండా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. 

ఒత్తిడిని తగ్గిస్తుంది.. 

డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలకు చికిత్స అందించడంలో సౌండ్ బాత్ సహాయ పడుతుంది.2016లో 62 మంది పెద్దలపై జరిపిన ఓ అధ్యయనం సౌండ్ బాత్ కు ముందు ,తర్వాత వారిలో మార్పును అంచనావేసింది. ఈ సౌండ్ బాత్ థెరపీ తర్వాత టెన్షన్ , ఆందోళన, చెడు ఆలోచనలు గణనీయంగా తగ్గాయని పరిశోధకులు కొనుగొన్నారు. 2020లో జరిగిన పరిశోధనల్లో సౌండ్ బాత్ శారీరక నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని తెలిసింది. 

ప్రశాంతమైన నిద్రకు సహకరిస్తుంది.. 

నిద్ర సమస్యలతో బాధపడుతున్న వారికి సౌండ్ బాత్‌ మంచి ఫలితాలనిస్తుంది. వినసొంసైన మ్యూజిక్ తో మనసుకు ప్రశాంతత కలిగి మంచి నిద్ర కు తోడ్పడుతుంది. 

ధ్యానం లాగానే, ధ్వని స్నానాలు మీరు ఈ సమయంలో మరింత ఎక్కువగా ఉండటానికి సహాయపడతాయి. మీ చుట్టూ ఉన్న శబ్దాలు మరియు అనుభూతులపై దృష్టి పెట్టడం ద్వారా, మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు మరియు అంతర్గత శాంతిని పెంపొందించుకోవచ్చు.

ALSO READ :- కొండలు, గుట్టలకు రైతుబంధు ఇయ్యం : భట్టి విక్రమార్క