గ్లోబల్​ వాటర్​ సెక్యూరిటీ రిపోర్ట్​

ఇటీవల గ్లోబల్​ వాటర్ సెక్యూరిటీ రిపోర్టును యునైటెడ్​ నేషన్స్​ ఆర్గనైజేషన్​ యూనివర్సిటీ (యూఎన్​యూ) విడుదల చేసింది. ఈ రిపోర్ట్​ ప్రకారం ప్రపంచంలో 2020 నాటికి భారత్​, చైనా సహా 113 దేశాల్లోని 560 కోట్ల మంది (72 శాతం)ని నీటి కష్టాలు చుట్టుముట్టనున్నాయి. పాకిస్తాన్​, ఇథియోపియా, హైథీ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మంది (8 శాతం) ప్రజలకు తాగడానికి పరిశుభ్రమైన తాగునీళ్లు దొరకడం కష్టమేనని, జల సంక్షోభంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడటం వల్ల ఆకలి చావులు పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొన్నది. 

  •  ప్రపంచ జనాభాలో సుమారు 100 కోట్ల మంది (20 శాతం) మందికి మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉన్నాయని రిపోర్టు స్పష్టం చేసింది. 
  • యూఎన్​ఓ నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి సూచికల్లో ప్రధానమైంది అందరికీ సరిపడా పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచడం. ఈ లక్ష్యంపై యూఎన్​యూ 186 దేశాల్లో నివసిస్తున్న 778 కోట్ల ప్రజలకు 2030 నాటికి పరిశుభ్రమైన నీరు ఏ మేరకు అందుబాటులో ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలతో ప్రపంచ జలభద్రత నివేదికను ఇటీవల విడుదల చేసింది. 
  • పాకిస్తాన్​, ఇథియోపియా, హైతీ, చాద్​, లైబేరియా, మడగాస్కర్​ తదితర 24 దేశాల్లోని 6.42 కోట్ల మందికి తాగడానికి పరిశుభ్రమైన గుక్కెడు నీళ్లు కూడా అందుబాటులో ఉండవు. 
  • ఫిన్లాండ్, అమెరికా, న్యూజిలాండ్​, నార్వే, యునైటెడ్​ కింగ్​డమ్​, స్వీడన్, స్విట్జర్లాండ్​, లక్సెంబర్గ్​, లాతివయా తదితర దేశాల్లోని 100 కోట్ల మంది 49 దేశాల్లోని 100 కోట్ల మంది ప్రజలకు మాత్రమే తగినన్ని పరిశుభ్రమైన నీళ్లు అందుబాటులో ఉంటాయి.