OTT Thriller Movie: దేశంలోనే అతిపెద్ద కుంభకోణంపై వెబ్ సిరీస్.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

స్టార్ హీరో మనోజ్ భాజ్ పాయ్ (Manoj Bajpayee) నటించిన 'డిస్పాచ్' (Despatch) వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇటీవలే  55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2024లో ప్రీమియర్‌ను ప్రదర్శించారు. జీడీఆర్ 2జీ స్కామ్ ను వెలికి తీసే జర్నలిస్టు చుట్టూ తిరిగే కథగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది.

లేటెస్ట్గా ఈ  థ్రిల్లర్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. జీ5 ఓటీటీలో డిసెంబర్ 13 నుంచి 'డిస్పాచ్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఇండియాలోనే అతిపెద్దదైన, దేశాన్ని కుదిపేసిన 2జీ స్కామ్ కేసును ఛేదించిన జర్నలిస్టు చుట్టూ తిరిగే కథాంశంతో ఈ మూవీ రాబోతుంది. ఇందులో మనోజ్ భాజ్ పాయ్ (జాయ్ బాగ్) ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటిస్తున్నాడు. షహానా గోస్వా, అర్చిత అగర్వాల్ ముఖ్య పాత్రలను పోషించారు.

ఓ హత్య, చోరీకి సంబంధించి మనోజ్ భాజ్ పాయ్ వెలితీసే నిజాలు.. అందులో భాగంగా రూ.8 వేల కోట్ల విలువైన స్కామ్ ను ఛేదించే దిశగా ట్రైలర్ ఆసక్తిగా సాగింది. మీడియా అవినీతి మరియు అండర్‌వరల్డ్ పవర్ ప్లేల వలయంలో చిక్కుకునే జాయ్ బాగ్‌కు వ్యతిరేకంగా బెదిరింపులు ఎదురవుతాయి. ఇబ్బందులను ఎదుర్కొని స్కామ్ ని ఎలా వెలికితీసాడు అనేది ప్రధాన స్టోరీగా తెలుస్తోంది. 

ALSO READ : Pushpa2 First Review: ఈడొకడు.. ఇంకా రాలేదేంటా అనుకున్నాం.. వచ్చేశాడయ్యా పుష్ప2 రివ్యూతో..!

అయితే.. 2004 నుంచి 2014 మధ్య దేశంలో ఉన్న యూపీఏ సర్కారు హయాంలో సంచలనం సృష్టించిన 2జీ స్కామ్ గురించి తెలిసిందే. దేశాన్ని ఇది ఎంతలా కుదిపేసిందో ప్రతిఒక్కరు కథనాల్లో చదివే ఉంటారు. అంతేకాకుండా కొందరు టెలికాం ఆపరేటర్లకే 2జీ స్పెక్ట్రమ్ ను కట్టబెట్టారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు జైలుకి కూడా వెళ్లారు. ఇప్పడాలాంటి కథ, కథనాలతో వస్తోన్న డిస్పాచ్' వెబ్ సిరీస్ పై అంచనాలు పెరిగాయి.