- డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ రమేశ్
ఆర్మూర్, వెలుగు: విద్యార్థులు అల్బెండజోల్ మాత్రలు తప్పకుండా వేసుకోవాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ రమేశ్ సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లోని ప్రైమరీ, హైస్కూల్ లో స్కూల్ లో మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఆధ్వర్యంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ జరిగింది.
డాక్టర్ రమేశ్ హాజరై మాట్లాడుతూ.. మల విసర్జన తర్వాత, మట్టిలో ఆడిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోకోకపోవడంతో నులిపురుగులు తయారయ్యే అవకాశం ఉందన్నారు. ఆర్మూర్ సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి, ఆరోగ్య కార్యకర్తలు జక్కుల మోహన్, శ్యామల, స్టాఫ్ నర్స్ స్రవంతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.