24 గంటల ప్రసూతి సేవలు వినియోగించుకోవాలి : డాక్టర్​ రమేశ్‌

ఆర్మూర్, వెలుగు:  ఆర్మూర్ ఏరియా హాస్పిటల్ లో 24 గంటలు ప్రసూతి సేవలను గ్రామీణ ప్రాంతాలకు చెందిన గర్భిణీ లు సద్వినియోగం చేసుకునేలా హెల్త్ స్టాఫ్ కృషి చేయాలని డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ వో డాక్టర్​రమేశ్​ అన్నారు. ఆర్మూర్ ఏరియా హాస్పిటల్ లో గురువారం ఆర్మూర్ డివిజన్ స్థాయి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మాతా శిశు సంరక్షణ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. 

డిప్యూటీ డీఎంఅండ్ హెచ్​వో డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ ...  పీహెచ్ సీ ల పరిధిలో సమీక్ష ఏర్పాటు చేసిగవర్నమెంట్ ఆసుపత్రిలో మాత్రమే డెలివరీ జరిగేటట్లు చూడాలని ఆదేశించారు.  ఆర్మూర్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌  రవి, సీహెచ్ఓ కృష్ణమూర్తి,  డాక్టర్స్ నాగరాజు, స్రవంతి, అపర్ణ, గీత, సబ్ యూనిట్ ఆఫీసర్ సాయి స్టాఫ్ పాల్గొన్నారు.