ఖమ్మం జిల్లాలో రోడ్ల పనులు స్పీడప్ చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎర్రుపాలెం, వెలుగు : రోడ్ల పనులను స్పీడ్ అప్ చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  మంగళవారం మండలంలో పర్యటించారు. కండ్రిక గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. జమలాపురంలో రూ 5.80 కోట్లతో అర్బన్ పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమలాపురం గ్రామాన్ని ఇండియాలోనే ఓ ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలన్నారు. 

బుచ్చిరెడ్డిపాలెం ఇంద్రమ్మ  చెరువు, జమలాపురం చెరువులను పర్యాటక అభివృద్ధి చేయాలని చెప్పారు. డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్ అండ్ డీ ఎస్ఈ హేమలత, పీఆర్ ఈఈ వెంకట్ రెడ్డి, డీపీవో ఆశాలత, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.