రామలింగేశ్వర పనులు త్వరగా పూర్తి చేయాలి : భట్టి విక్రమార్క

వైరా, వెలుగు : వైరా మండలం స్నానాల లక్ష్మీపురం లో రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో రూ.3.20కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలసి ఆయన పనులను పరిశీలించారు. బిల్డింగ్ నిర్మాణ పనులకు అడ్డంగా ఉన్న  విద్యుత్త్ లైన్ ను వెంటనే మార్చాలని సూచించారు.

అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల  దుర్గాప్రసాద్, నూతి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శీల వెంకట నర్సిరెడ్డి, దొడ్డ పుల్లయ్య, మల్లు రామకృష్ణ, ఏదునూరు సీతారాములు, పొదిలి హరినాథ్, వడ్డే నారాయణ, పమ్మి అశోక్, పనితి శీను తదితరులు పాల్గొన్నారు.