కేజీబీవీలో డీఈవో ఆకస్మిక తనిఖీ

మాక్లూర్, వెలుగు : మాక్లూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్, కాలేజీలో డీఈవో గురు ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, స్టోర్​ రూమ్, క్లాస్ రూమ్స్​శుభ్రంగా ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు.

ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తీరును  ఐసీఎస్​వో సవితను అడిగి తెలుసుకున్నారు. త్వరలో టెన్త్​ ఎగ్జామ్స్​ షురూ కానున్న నేపథ్యంలో విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేయాలన్నారు.