లింగంపేట మండలంలో 10 మందికి డెంగ్యూ

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగం పేట మండలంలో డెంగ్యూ బాధితులు పెరిగిపోతున్నారు. ఇప్పటివరకు లింగంపేటలో ఏడుగురు, పోతాయిపల్లి, పొల్కంపేట, మెంగారం గ్రామాల్లో ఒక్కొక్కరు చొప్పున డెంగ్యూ బారిన పడి హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నారు. వానాకాలం ప్రారంభమైనప్పటికీ గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టపకపోవడం, దోమల నివారణ మందులు స్ర్పే చేయకపోవడంతోనే డెంగ్యూ ప్రబలుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆఫీసర్లు స్పందించి శానిటేషన్‌‌ పనులు చేపట్టాలని కోరుతున్నారు. పీహెచ్‌‌సీ డైక్టర్‌‌ హిమబిందు మాట్లాడుతూ పది మందికి డెంగ్యూ సోకిన మాట వాస్తవమేనని, వారందరికీ మెరుగైన వైద్యం అందజేస్తున్నామని చెప్పారు.