హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా పీవీ జిల్లాను ప్రకటించాలి

హుజూరాబాద్​ వెలుగు: హుజురాబాద్ కేంద్రంగా పీవీ జిల్లాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మున్సిపల్‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌లో జిల్లా సాధన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో హుజూరాబాద్ పాలన కేంద్రంగా ఉండేదన్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న 14 మండలాలను కలుపుకొని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.  

జిల్లాగా  ప్రకటించే దాకా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో  జేఏసీ చైర్మన్ బీమోజు సదానందం, కమిటీ సభ్యులు  వేల్పుల రత్నం,  పొడిసెట్టి వెంకట్రాజం, ఆలేటి రవీందర్, మొగిలయ్య, రాజన్న, రమేశ్‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.