ఆర్మూర్ లో తోపుడు బండ్లు అందజేత

ఆర్మూర్, వెలుగు:  రోటరీ పీడీ ఎన్వీ హన్మంత్ రెడ్డి తండ్రి నల్ల వెంకట్ రెడ్డి స్మారకార్థం  ఆర్మూర్ లోని 10 మంది స్ట్రీట్​ వెండర్స్​ కు( చిరు వ్యాపారులకు) రూ.1,60,000 వేలు విలువ గల 10 తోపుడు బండ్లను శుక్రవారం అందజేశారు. శుక్రవారం ఆర్మూర్ లో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గోపికృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తోపుడు బండ్ల పంపిణీ జరిగింది. తోపుడు  బండ్ల దాత రోటరీ పీడీ ఎన్వీ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ... తోపుడు  బండ్లు లేక ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారుల పరిస్థితి చూసి వారికి తోపుడు బండ్లను అందించామన్నారు. కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి పట్వారీ తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, కాంతి గంగారెడ్డి , విజయసారథి, చరణ్ రెడ్డి, పద్మ మురళి, పుష్పకర్ రావు, రాజేందర్, రాం ప్రసాద్, ఆనంద్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు.