జగదీశ్ టైట్లర్‌పై హత్య కేసు పెట్టండి

  • సీబీఐని ఆదేశించిన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు
  • 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తగిన సాక్ష్యాలు ఉన్నాయని వెల్లడి

న్యూఢిల్లీ : సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత జగదీశ్​ టైట్లర్‌‌పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐని ఆదేశించింది. అల్లర్ల సమయంలో ఆయన గుంపును రెచ్చగొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారని.. హత్య, ఇతర నేరాభియోగాలకు సంబంధించి తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 

1984 నవంబర్ 1న పుల్ బంగాశ్ గురుద్వారా సమీపంలో గుమిగూడిన జనాలను టైట్లర్ రెచ్చగొట్టినట్టు సీబీఐ 2023 మే లో దాఖలు చేసిన చార్జ్​ షీట్‌‌లో ఆరోపించింది. టైట్లర్ గురుద్వారా ముందు కారులోంచి దిగి ‘‘సిక్కులను చంపండి, వారు మన తల్లిని చంపారు” అని అక్కడున్న గుంపును రెచ్చగొట్టినట్టు ప్రత్యక్ష సాక్షి చెప్పారని సీబీఐ పేర్కొంది. ‘‘సిక్కులను చంపి, ఆపై దోపిడీలో పాల్గొనండి”

ALSO READ : మోదీజీ.. జవాబివ్వలేదేం : మమతా బెనర్జీ

అని టైట్లర్​ చెప్పినట్లు మరో సాక్షి హర్పాల్ కౌర్ బేడీ చెప్పారు. ఆ సమయంలో గురుద్వారా దగ్గర ఉద్రిక్త పరిస్థితులు, గందరగోళం ఉందని, టైట్లర్ అక్కడే ఉన్నాడని.. అయితే గుంపుతో ఆయన ఏ మాట్లాడింది వినిపించలేదని మరికొందరు చెప్పారు.