ఆప్ పార్టీకి బిగ్ షాక్.. బీజేపీలో ఐదుగురు ఢిల్లీ కౌన్సిలర్లు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి గట్ట ఎదురు దెబ్బ తగిలింది..ఆప్ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఆదివారం (ఆగస్టుమ 25, 2024) బీజేపీలో చేరారు. ఆప్ పార్టీకి చెందిన ఢిల్లీ కౌన్సిలర్లు రామ్ చంద్ర, పవన్ సెహ్రావత్, మంజు నిర్మల్, సుగంధ బిధురి, మమత పవన్లు.. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ , బీజేపీ సీనియర్ నేత రాంవీర్ సింగ్ బిధూరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో AAP పేలవమైన పనితీరుతో విసుగెత్తి బీజేపీలో చేరారని బీజేపీ ఢిల్లీ యూనిట్ సోషల్ మీడియా ప్లాట్ ఫారం X లో తెలిపా రు. అంతకుముందు జూలై నెలలో ఆప్ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఆప్ ఛతర్ పూర్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్, ఢిల్లీ మాజీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ బీజేపీలో చేరారు.