Diwali 2024 : దీపావళి స్వీట్స్​.. మలై లడ్డు..కాజు కట్లీ..చావల్ కీర్..బిస్కెట్ లడ్డు ఇంట్లోనే తయారు చేసుకోండి

దీపావళి వచ్చింది.. అందరూ టపాసులు కాల్చుతారు.  చాలామంది స్నేహితులకు.. బంధువులకు గిప్ట్స్​ ఇస్తుంటారు.   చాలామంది స్వీట్స్​ గిప్ట్స్​ ఇస్తారు. పటాకులు కాల్చిన తరువాత.. వారే నరకాసురుడిని చంపారా అన్నరీతిలో సంబరాలు చేసుకుంటూ స్వీట్స్​తింటారు.  అయితే బయట స్వీట్​ షాపుల్లో దొరికే స్వీట్స్​ కంటె ఇంట్లోనే వెరైటీ స్వీట్లను తయారుచేసుకోవచ్చు.. మరి ఎంతో అద్భుతంగా ఉండే స్వీట్లను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .

మలై లడ్డు తయారీకి కావలసినవి 

  • మైదాపిండి: అర కిలో
  •  నెయ్యి: 400 గ్రాములు
  • పంచదార పొడి: కిలో 
  • జీడిపప్పు- పావుకిలో
  • హార్లిక్స్ పౌడర్. 200 గ్రాములు
  • అమూల్ స్పీ: 800 గ్రాములు
  • జాజికాయ, జాపత్రి:5 గ్రాములు
  • యాలకుల పొడి. 10 గ్రాములు
  • కిస్​ మిస్​ :  50 గ్రాములు
  • పిస్తా: 100 గ్రాములు

తయారీ విధానం :  ముందుగా స్టౌ పై పాన్​ ఉంచి నెయ్యి వేయాలి. అది వేడెయ్యాక అందులో మైదాపిండి వేసి సన్నటి మంట పై వేగించాలి. ఇలా వేగిన మైదాను ఒక గిన్నులోకి తీసుకొరి చల్లార్చాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత అందులో అమూల్ స్ప్రే, హార్లిక్స్ పౌడర్, పంచదార పొడి వేసి బాగా కలపాలి. పిండి బాగా మెత్తగా ఉంటే పంచదార పొడి మరికొంచం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు, పిస్తా బాదం.. చిన్న చిన్న ముక్కలుగా కోసి నెయ్యిలో వేగించాలి. వాటిని ముందుగా రెడీ చేసుకున్న పిండిలో వేయాలి. ఆపై కిస్​ మిస్, యాలకులపొడి, జాజికాయ, జాపత్రి చేర్చి నెమ్మదిగా కలపాలి.. ఇలా తయారైన పిండిని కాసేపు ఆరబె ట్టాలి. తర్వాత అరచేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని కొద్ది కొద్దిగా పిండి 
తీసుకుంటూ లడ్డూలుగా చుట్టాలి

కాజు కట్లీ తయారీకి కావలసిన పదార్థాలు: 

  • కుంకుమ పువ్వు 1 టీస్పూన్.
  • జీడిపప్పు: 100 గ్రాములు
  • చక్కెర: 6 టేబుల్ స్పూన్లు.. 
  • యాలకుల పొడి: అర టీస్పూన్

తయారు చేసే విధానం: జీడిపప్పుని పొడి చేయాలి. ఒక పాన్​ లో కొన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. ఇప్పుడు అందులో చక్కెర, కుంకుమపువ్వు వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత యాలకుల పొడి, జీడిపప్పు పొడి కలిపి మూడు నిమిషాలు ఉడికించి దించేయాలి. ఇపుడు ఆ మిశ్రమాన్ని ఒక ప్లేటులో పోయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి

చావల్ కీర్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • బాస్మతి రైస్ - పావు కప్పు 
  • పాలు ఆరు కప్పులు 
  • కండెన్ల్స్​  మిల్క్: ముప్పావు కప్పు 
  • చక్కెర - పావు కప్పు
  • యాలకుల పొడి అరటీస్పూన్
  •  బాదం: 10 
  • రోస్ట్ చేసిన పిస్తా 30 గ్రాములు (గార్నిష్ 50) 

తయారు చేసే విధానం:బాస్మతి రైస్ ను బాగా కడిగి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తర్వాత బియ్యాన్ని పడగట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు అడుగు మందంగా ఉండే పాన్ తీసుకుని పాలు కాచాలి... అందులో నానబెట్టిన బాస్మతి రైస్ ను వేసి ఇరవై నిమిషాలు ఉడికించాలి.  తర్వాత అందులో మిల్క్ మేడ్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు చక్కెర, యాలకుల పొడి, బాదం వేసి బాగా కలిపి ఐదు నిమిషాల తర్వాత దించేయాలి. ఈ కీర్ ను రోస్ట్ చేసిన పిస్తాతో.. గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు.

పనీర్ పాయనం తయారీకి కావలసిన పదార్థాలు:

  •  పాలు (ఫుల్ క్రీమ్) 1 లీటరు 
  • పనీర్ తురుము- ముప్పావు కప్పు
  •  చక్కెర - పావు కప్పు 
  • యాలకుల పొడి : అర టీస్పూన్ 
  • రోజ్ వాటర్: 1 టీస్పూన్(గార్నిష్ కోసం )
  • బాదం పలుకులు: 2 టీస్పూన్లు
  • రోస్ట్ చేసిన పిస్తా 2 టీస్పూన్లు

తయారు చేసే విధానం: అడుగు మందంగా ఉండే పాన్ తీసుకుని పాలు చిక్కగా అయ్యేవరకు కాచాలి. ఇప్పుడు కుంకుమపువ్వు, యాలకుల పొడి, చక్కెర, పనీర్ తురుము వేసి ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. తర్వాత రోజ్ వాటర్ కలపాలి. బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

బిస్కెట్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు:

  •  మ్యారీ బిస్కెట్లు ప్యాకెట్
  • కండెన్స్ మిల్క్: అరకప్పు 
  • కోకో పౌడర్: నాలుగు టేబుల్ స్పూన్లు
  • పాలు: రెండు టీ స్పూన్లు
  •  డ్రై ఫ్రూట్స్ 2 టేబుల్ స్పూను (సన్నగా తరగాలి) 
  • గార్నిష్​ కోసం: రెయిన్ బో స్పింక్లర్స్ ఒక టీస్పూన్ 
  • చాక్లెట్: అర కప్పు (సన్నగా తరగాలి)
  • తురిమిన కొబ్బరి నాలుగు టేబుల్ స్పూన్లు

 తయారు చేసే విధానం: ముందుగా బిస్కెట్లని గ్రైండర్లో వేసి మెత్తని పొడిలా చేయాలి. ఒక గిన్నె తీసుకుని అందులో రెండు లేదా మూడు స్పూన్ల కండెన్స్​ మిల్క్ , తర్వాత కోకో పౌడర్ వేసి బాగా కలపాలి. చిక్కగా ఉండే ఈ మిశ్రమంలో బిస్కిట్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. కావాలంటే ఇంకొంచెం కండెన్స్​  మిల్క్, కోకో పౌడర్ కలుపుకోవచ్చు. ఇలా చేస్తే లడ్డూలు మరింత మృదువుగా వస్తాయి. తర్వాత చేతికి నెయ్యి లేదా నూనె రాసుకొని లడ్డూ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని లడ్డూలా చుట్టాలి. ఇలా తయారు చేసిన లడ్డూల మీద తురిమిన చాక్లెట్ తురిమిన కొబ్బరి, రెయిన్ బో స్పింక్లర్స్ వేసి అలంకరించాలి. లడ్డూలను పది నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి సర్వ్ చేయాలి.

–వెలుగు, లైఫ్–​