Diwali 2024:  ఈ దీపావళిని ఆనందంగా.. కేరింతలతో ఇలా జరుపుకోండి..!

దీపావళి పండుగ రోజు బాణాసంచా మోతలతో ఎంజాయ్ చేయాలనుకుంటారు ఎక్కువమంది. అయితే దానివల్ల వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం పెరిగి పర్యావరణానికి, మూగజీవులకు హాని జరుగుతుంది. అందువల్ల ఈసారి టపాసులకు 'నో' చెప్పి గ్రీన్ దీపావళికి స్వాగతం చెప్పండి

దీపావళి అంటేనే వెలుగుల పండుగని. అందుకే ఇంటిని, వాకిలిని దీపపు కాంతులతో అలంకరిస్తుంటాం. ఈ క్రమంలో కొందరు రంగురంగుల ఫ్లోరోసెంట్ బల్బ్​లను పెడుతుంటారు. కానీ వాటివల్ల పెద్దమొత్తంలో కరెంట్ ఖర్చవుతుంది. అలాకాకుండా ఉండాలంటే విద్యుత్ దీపాల చమక్కులకు చెక్ చెప్పి మట్టి ప్రమిదల్లో నూనె పోసి వెలిగించండి. నేచురల్ వెలుగులతో మీ ఇంటిని నింపేయండి. కావాలనుకుంటే.. ఆ దీపాలకు మీ చేతితో రంగులద్ది అందంగా అలంకరించండి. ఇవికాకుండా గోధుమపిండితో, నారింజ తొక్కలతో, కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా మలిచి కూడా దీపాలు వెలిగించొచ్చు.

పచ్చని బహుమతి 

ఆత్మీయులకు, మిత్రులకు శుభాకాంక్షలతో పాటు తీపిని అందిస్తాం. ఇంటి ముందు దీపాల్ని వెలిగిస్తాం. ఈ దీపావళి నుంచి ఆ సంప్రదాయాలతో పాటు ఓ మొక్కను బహుమతిగా ఇద్దాం. స్వచ్ఛమైన గాలిని అందించే మొక్కలను, గాలిని శుభ్రపరిచే మొక్కలను ఈసారి గిఫ్ట్​ గా  ఇవ్వండి.  ఇవికాకుండా జ్యూట్ బ్యాగ్స్, ఖాదీ బట్టలు, సోలార్ పవర్ తో పనిచేసే గ్యాడ్జెట్ లను దీపావళి బహుమతులుగా ఇవ్వొచ్చు. పాత న్యూస్​ పేపర్లనే రేపర్స్ గా గిఫ్ట్ ప్యాక్ లు చేయండి. పర్యావరణానికి నష్టం కలగకుండా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయండి.

ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్

వాతావరణానికి ఎలాంటి హాని చేయని, ధ్వని కాలుష్యం లేని గోస్టిక్స్, స్నేక్ మిక్స్, ఫేక్ నోట్, ఫ్లవర్ పవర్ వంటి ఎకోఫ్రెండ్లీ క్రాకర్స్ మార్కెట్లో ఉన్నాయి. వీటిని రీసైకిల్ పేపర్స్ తయారుచేస్తున్నారు. ఈ క్రాకర్స్  తో గ్రీన్  దీపావళికి స్వాగతం చెప్పొచ్చు. రంగు రంగుల బెలూన్లకి గ్లిట్టర్ పూసి మెరిపించేయండి..

రంగోలీ..

పూర్వం ఇంటిముందు బియ్యం పప్పులతో రంగవల్లులు వేసేవాళ్లు. అలాగైనా పక్షులకు కొంత దాణా దొరుకుతుందని వాళ్లు భావించేవాళ్లు. మళ్లీ ఆ కాలం రావాలని కోరుకుందాం. ఈసారి కెమికల్ కలిపిన రంగవల్లుల బదులు బియ్యం, పప్పులతో నింపి పువ్వులతో ఫినిషింగ్ టచ్ ఇవ్వండి. , పువ్వులు ఎండిపోతే ఆ పూలను కూడా తర్వాత రోజు కంపోస్ట్ ఎరువుగా తయారుచేసుకొని మీ గార్డెన్ కోసం ఉపయోగించండి. డెకరేషన్లో ప్లాస్టిక్​ ను  దరిచేరనీయకుండా కలర్​ ఫుల్​ దుపట్టా, చీరలతో ఇంటిని అలంకరించండి..

బీకేర్​ ఫుల్​..

 ఏ పండుగ జరిగినా ప్రశాంతంగానే ముగుస్తుంది. కానీ దీపావళికి మాత్రం ఎక్కడో ఒకచోట ఏదో ఒక చెడు వార్త వినాల్సి వస్తుంది. కాబట్టి ఈ పండుగ పూట జాగ్రత్తగా ఉండండి. చేయాల్సినవి. చేయకూడనివి ఏంటో తెలుసుకోండి.

 

  •  ఇంట్లో, ఇంటి దగ్గరలో అస్సలు పటాసులు కాల్చొదు.. అలాగే కాల్చేచోట చెట్లు, పచ్చగడ్డి, అంటుకునే వస్తువులు లేకుండా శుభ్రం. చూసుకోండి.
  •  కాలిన గాయాలకు వాడే క్రీములు, ఐ-డ్రాప్స్, ఇన్ హేలర్స్ కూడా మీతో పాటు ఉంచుకోండి.. పొగ కారణంగా వీటి అవసరం కూడా రావొచ్చు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కంపల్సరీ!
  •  పక్కన ఎప్పుడూ నీళ్లను పెట్టుకోండి. అనుకోని ప్రమాదం జరిగితే వెంటనే నీళ్లు చల్లడానికి ఉపయోగపడతాయి.
  •  పాకెట్  టపాసులను పెట్టుకొని తిరుగొద్దు. అవి ఏ క్షణంలో ఎలాగైనా పేలితే ముప్పు మీకే!
  •  మెటల్, గ్లాస్ కంటెనయిర్లలో టపాకాయలను కాల్చండి
     

–వెలుగు, లైఫ్​–