Deepavali 2024:  దీపావళి పండుగ వెనుక పురాణ కథలు ఇవే..

దీపావళి పండుగ అంటే దీపాలు వెలిగించడం.. టపాసులు కాల్చడం.. స్వీట్స్​ తినడం.. ఇది దాదాపు ప్రతి ఇంట్లో జరిగే ఆచారమే. అసలు దీపావళి అంటే ఏమిటి.. ఈ పండుగ వెనుక అనేక పురాణా కథలున్నాయి. దీపావళి అంటే దీపాల వరస. చీకటిని పారదోలి వెలుగునిచ్చే ఆయుధం దీపమే అని పండితులు చెబుతున్నారు. దీపావళిని కొన్ని ప్రాంతాల్లో దివ్వెల పండగ అని, మరికొన్ని ప్రాంతాల్లో దివిటీల పండగ అని పిలుస్తారు. అసలు దీపావళి వెనుక ఉన్న పురాణ కథల గురించి తెలుసుకుందాం. . .

దీపావళి పండుగను వేద కాలం నుంచి రుషులు, మునులు, మహర్షులు నిర్వహించేవారని పురాణాలు చెబుతున్నాయి.  అయితే ద్వాపర యుగంలో నరకాసుర వధ ఆశ్వయుజ మాసం చతుర్ధశి రోజన జరిగింది.  అప్పటి నుంచి దీపావళి పండుగ ద్వాపర యుగానికి చెందినదని ... చారిత్రక కాలం నుంచి పిల్లలు.. పెద్దలు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.  టపాసులు కాల్చి ఆనందంగా జరుపుకునే పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. 

చారిత్రక కాలంలో దీపావళి పండుగ అనగానే శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన కథ మనకు జ్ఞాపకం వస్తుంది. దీంతో పాటు మరెన్నో చారిత్రక సందర్భాలు కూడా దీపావళి పండుగ వెనుక ఆధారాలుగా ఉన్నాయి. అవేమిటంటే.. రావణాసురుణ్ణి వధించి అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు తమ్ముడైన భరతుణ్ణి కలుసుకున్న రోజు దీపావళి. . జూదంలో ఓడి అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన పాండవులు తిరిగి హస్తినాపురానికి తిరిగి వచ్చింది ఈ రోజేనట. షట్చక్రవర్తుల్లో ఒకడైన విక్ర మాదిత్యుడు పట్టాభిషేకం జరిగింది దీపావళినాడే. ఇంకా తొలి తెలుగు రాజైన శాలివాహను డు, విక్రమార్కుడిని ఓడించి ఆంధ్రసామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసింది ఈ రోజేనని అంటారు. రాక్షస రాజైన బలి చక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపిన రోజు. దీపావళి నుంచే విక్రమార్క శకం ప్రారంభమైంది. చతుర్దశి రోజున దీపోత్సవం చేసి యమ తర్పణం చేయాలని ధర్మశాస్త్రాల్లో ఉంది. 

Also Read :- ఇంద్రుడికి సకల భోగాలు తిరిగి ఇచ్చింది లక్ష్మీదేవినే

ఇక దీపావళి పండుగ విషయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు.  ఉత్తర భారతదేశంలో ఐదు రోజులు జరుపుకుంటే... దక్షిణ భారత దేశంలో రెండు రోజులు జరుపుకుంటారు,  గుజరాత్​ లో దీపావళి రోజున కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది.  మధ్యప్రదేశ్​ లో  మహాలక్ష్మీ దేవి భర్త శ్రీహరి.. భూలోకానికి  ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున వచ్చాడని.. ఆయనకు స్వాగతం పలికేందుకు టపాసులు కాలుస్తూ.. దీపావళి పండుగను జరుపుకుంటారు.  ఇక కలకత్తాలో దీపావళి రోజున కాళీ పూజ చేస్తారు. 

ముద్రా రాక్షస గ్రంథలో దీపావళి పండుగ రోజు ఏం చేయాలో మహర్షులు వివరించారు.  ఆరోజున కౌముదీ మహోత్సవాన్ని జరుపుకోవాలని ఆ గ్రంథంలో పేర్కొన్నారు.  కౌముది మహోత్సవం.. దీపాలు వెలిగిస్తూ.. సంబరాలు చేసుకోవాలట.  ఆ తరువాత దీపదానం చేయాలి.  ఇక బౌద్ధ గ్రంథాల్లో కూడా దీప దానం.. దీపోత్సవం వంటి అంశాలను ప్రస్తావించారు.  బుద్దుని చుట్టూ దీపాలు పెట్టి.. ప్రత్యేకంగా పూజలు చేసేవారని బౌద్దగ్రంథాల ద్వారా తెలుస్తుంది.  

ఇక రాజుల కాలంలో దీపావళి పండుగను ఎంతో వైభవంగా జరుపుకునేవారు.  ఆడబిడ్డలను పుట్టింటికి పిలిచి.. అల్లుడు, కూతురికి బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉండేది.  దీనికి సంబంధించి..  నాగానందం  అనే కావ్యంలో ప్రస్తావించారు.  విశ్వవసు అనే రాజుకు సంతానం లేదు.  ఎన్నో పూజలు.. పునస్కరాలు.. పండితుల సలహా మేరకు దానాలు.. యఙ్ఞాలు చేశాడు,  అపంపుడు  విశ్వవసు రాజు భార్య గర్భవతి అయి ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు జన్మించింది.  ఈమెకు మలయవతి అని పేరు పెట్టి... తనకు కుమార్తె పుట్టిన సందర్భంగా ఆ రాజ్యంలోని ప్రజలందరూ దీపాలు వెలిగించి పూజలు చేసి సంతోషంగా సంబరాలు చేసుకున్నారు.  ఇక విజయనగర సామ్రాజ్య కాలంలో  దీపావళి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునే వారని.. ప్రతి వీధిలో దీపాలు వెలిగించేవారని చరిత్ర చెబుతోంది.

-వెలుగు, దీపావళి స్పెషల్​‌‌–