Diwali 2024 : దీపావళి ప్రమిదల్లో ఎన్ని ఒత్తులు ఉండాలి.. ఒక్కో ఒత్తి ఒక్కో దీవెన ఇస్తుంది..!

దీపావళి రోజు  ఇంటి గుమ్మం ముందు, తులసి కోట ముందు దీపాలను వెలిగిస్తారు. ఆ దీపాల్లో సకల దేవతల అనుగ్రహాలు, వేదాలు, శాంతి, ధనం, సిరి సంపదలు ఉంటాయని భక్తులు నమ్ముతారు.  పురాణాల ప్రకారం దీపావళి రోజు దీపాలు వెలిగించేటప్పుడు ఎన్ని ఒత్తులు వెలిగించాలో  తెలుసుకుందాం.  .

అష్టాదశపురాణాల ప్రకారం దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం..  అందుకే దీపావళి రోజున దీపాలతో ఇంటిని అలంకరిస్తారు.  తెలుగు రాష్ట్రాల్లో ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున( అక్టోబర్ 30)  దీపాల పండుగ ప్రారంభమవుతుంది.  అప్పటి నుంచి కార్తీక మాసంలో కూడా సంధ్యా సమయంలో ( సాయంత్రం) ప్రమిదలలో నూనె తోకాని.. ఆవు నెయ్యి తో కాని దీపాలు వెలిగిస్తారు. ఇంటి గుమ్మం దగ్గర.. తులసి చెట్టు దగ్గర.. ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు పెడతారు.. 

దీపాల్లో ఎన్ని ఒత్తులు  వేయాలి..

దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులు వేసి... ఇంటి ఇల్లాలు.. ఆడపిల్లలు వెలిగించాలి. తరువాత దీపారాధన కుంది చుట్టూ కుంకుమ బొట్టు పెట్టి.. మరల  ఒక చుక్క నూనె వడ్డించాలి.  దీపారాధన కుందులు.. లేక ప్రమిదల్లో  ఐదు ఒత్తులు వేసి వెలిగించాలి.  ఇందులో మొదటి ఒత్తి భర్త క్షేమం కోసం.. రెండవది  అత్తమామల ఆశీర్వాదం ఉండాలని.. వారు బాగుండాలని.. మూడవ దీపం.. అక్క చెల్లెళ్ల  క్షేమం కోసం.. నాలుగవది ధర్మం.. గౌరవం.. అంతా మంచిగా ఉండి.. పాడి పంటలు వృద్ది చెందాలని.. ఉద్యోగ వ్యాపారాల్లో రాణించాలని.. ఇక ఐదవది..వంశాభివృద్ది జరగాలని దేవతలను పూజిస్తూ వెలిగించాలి.  

తరువాత తులసి కోట దగ్గర .. ఇంట్లో దేవుడి మందిరం దగ్గర.. పసుపు, కుంకుమ, పూలతో అర్చించాలి.  అయితే దీపారాధనను అగ్గిపుల్లతో వెలిగించ కూడదు.  మొదట అగర్​ బత్తీని వెలిగించి దాని సహాయంలో వెలిగించాలి.  దేవాలయాలను ప్రతిష్టించే సమయంలో హోమం మొదలు పెట్టేటప్పుడు రెండు కర్రలతో అగ్నిని పుట్టించి దానితోనే హోమం మొదలు పెడతారు.  అగర్​ బత్తీని కూడా కర్రల నుంచి వచ్చిన పుల్లలతో తయారుచేస్తారు.  

దీపం సకల దేవతాస్వరూపం 

దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని.. దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చేయరు. దీపం సకల దేవతా స్వరూపం. హిందువులు సంపద దేవత అయిన లక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. .. దీపాలు లక్ష్మి దేవిని  ప్రజల ఇళ్లలోకి ఆహ్వానించేందుకు  సహాయపడతాయని,  శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవిని దీపంగా భావించి ప్రార్థిస్తారు. అంతేకాదు  మహిళలు ఈ కార్తీకమాసం అంతా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు.

దీపారాధాన వెలుగుతున్న ప్రదేశంలో శ్రీ మహాలక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని పండితులు చెబుతున్నారు.  దీపం లేని ఇళ్లు అమంగళకరంగా ఉంటాయి.  అందుకే పూర్వకాలంలో ఎవరైనా ఇతర గ్రామాలకు వెళ్లవలసి వస్తే .. ఆ ఇంటి పురోహితునికి ఇంటి తాళాలు ఇచ్చి వెళ్లేవారు. ఆయన వచ్చి దీపారాధన చేసి వెళ్లేవారు.  అంతేకాదు మార్కండేయ పురాణం ప్రకారం  దీపం పరబ్రహ్మస్వరూపం..దీపం సకల దేవతా స్వరూపం..  దీపం కుంది కింది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి, విస్ఫలింగం లక్ష్మీ దేవి. దీపారాధనలో వెండి కుందులు విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టికుందులది తర్వాతి స్థానం. దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు. కుంది కింద ...మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి. ఒకవేళ ప్రమిదల్లో దీపారాధన చేస్తే రెండు ప్రమిదలు ఒకదానిపై మరొకటి ఉంచి.. పైదానిలో నూనె పోసి వెలిగించాలి.

-–వెలుగు, దీపావళి ప్రత్యేకం–