Diwali 2024 : దీపావళి పండుగ అన్ని మతాల వారిదీ.. ఒక్కో మతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు..!

 దీపావళి పండుగ. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దీపాలు వెలిగించి, పటాసులు పిలుస్తూ ఆనందంగా జరుపుకునే పండుగ. స్వీట్స్ పంచి సంతోషాన్ని షేర్ చేసుకునే పండుగ. ఈ పండుగకు పురాణ, చారిత్రక సంబంధం ఉంది. హిందువులే కాకుండా ఇతర మతాలవాళ్లూ దీనిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. బౌద్ధులు,సిక్కులు, జౌనులు,  ఆర్యులకు దీపావళి పండుగకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం...

పు రాణాల ప్రకారం సత్యభామ, కృష్ణుడు సరణాసురుడనే రాక్షస చంపడంతో ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని చెప్తారు. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజూ దీపావళి అని అంటారు. అయితే, ఈ పండుగకు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.  హిందువులే కాదు బౌద్ధులు, జైనులు, సిక్కులు.. అనేక మతాల వాళ్లూ ఈ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే ! దీపావళికి వాళ్లకు ముడిపడిన చారిత్రక సంఘటనలు, సందర్భాలు ఉన్నాయి

బౌద్ధులు

దీపావళి బౌద్ధుల పండుగ కాదు. అయినా.. బౌద్ధమతంలో వజ్రయాన శాఖకు చెందిన వాళ్లు మాత్రం ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా నేపాల్లో ఉన్న 'నేవార్' ప్రజలు దీపావళిని చేసుకుంటారు. లక్ష్మీదేవిని దేవతగా భావించి ప్రార్థిస్తారు.. హిందువుల మాదిరిగానే .. నేపాల్​ లోని  బౌద్ధులు అయిదు రోజులపాటు 'దీపావళి తీహార్ పేరిట పండుగ జరుపుకుంటారు. నిజానికి వారి ఆచారం ప్రకారం ప్రపంచ స్వేచ్ఛకోసం ఏ దేవతనైనా ఆరాధించొచ్చు. ఆ విధంగా నేవాద్ బౌద్ధులు లక్ష్మీదేవిని, విష్ణువును ప్రార్ధించి పూజలు చేస్తున్నారన్నది పరిశోధకులు అభిప్రాయం..

జైనులు

జైనులు వాళ్ల గురువు మహావీరుడు నిర్యాణం  పొందిన రోజున దీపావళి జరుపుకుంటారు. వాళ్లు వెలిగించిన దీపాల కాంతిని మహావీరునికి అంకితంగా భావిస్తారు. అలాగే జైన సంప్రదాయం ప్రకారం 18మంది రాజులు మహావీరుని చివరి బోధనలను సేకరించి ప్రకాశవంతమైన కాంతి, మహావీర పేరుతో భద్రపరచారు. అందుకే దీపావళి పండుగను జైనులు అతని జ్ఞాపకంగా, బోధనలను గుర్తుచేసుకునే రోజుగా చేసుకుంటారని చెప్తారు. వీళ్ల సంప్రదాయం ప్రకారం వ్యాపారస్తులు కొత్త లెక్కలను దీపావళి రోజు నుండే మొదలుపెడతారు

సిక్కులు

దీపావళి పండుగకు సిక్కులకు చాలా దగ్గరి సంబంధం ఉంది. సిక్కుల మూడో గురువు అమర్దాస్ దీపావళి పండుగ గురించి చెప్పాడు. చెప్పటమే కాదు. గోయివ్వాల్ దగ్గర 84  మెట్లతో బావిని నిర్మించి, సిక్కులను ఆ పవిత్ర జలంతో శుద్ధి చేశాడు. క్రమంగా ఆ ఉత్సవం వాళ్ల పండుగలా, ఆధారంగా మారింది. గురువు ఆశీర్వాదం పొందేటప్పుడు తప్పమిసరిగా దీపాలు వెలిగించాలని అమర్దాస్ బోధించాడు. దీపావళి పండుగకు సిక్కులు జరుపుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. దీపావళి రోజు వాళ్ల గురువు హరగోవింద్, అతనితోపాటు 52 మంది సిక్కులు గ్వాలియర్ జైలు నుంచి విడుదల అయిన రోజు,  అలాగే 1577లో అమృతప్​ లోని స్వర్ణ దేవాలయానికి శంఖుస్థాపన జరిగింది దీపావళి రోజే. 1738 లో భియ్​ మణి సింగ్​ దీపావళి  జరుపుకునేందుకు జరిమానా చెల్లించలేక మతం మార్చుకునేందుకు ఇష్టపడక బలిదానం అయ్యాడు.

ఆర్యసమాజం

సంఘసంస్కర్త దయానంద సరస్వతి హిందూ మతంలోని మూఢనమ్మకాలు, అంటరానితనం, సతీసహగమనం, బాల్య వివాహాలు లాంటి గురాచారాలను పోగొట్టాలని  1875 ఏప్రిల్ 10న అభ్యసమాజాన్ని స్థాపించాడు. అతని బోధనలు నచ్చి చాలామంది రోజుల్లో ఆయనను అనుసరించారు.అయితే దయానంద సరస్వతి 1883లో దీపావళి రోజునే చనిపోయాడు. అందుకు గుర్తుగా ఆర్యసమాజ సిద్ధాంతాలను పాటించే వాళ్లు దీపావళిని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.

–వెలుగు, లైఫ్​‌‌–