RRB Goodnews: రైల్వే బోర్డ్ భారీ గుడ్‌న్యూస్.. 9వేల ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్

ఇండియన్ రైల్వేస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిరుద్యోగులకు  శుభవార్త చెప్పింది. ఇటీవల విడుదల చేసిన టెక్నీషియన్ పోస్టుల సంఖ్యను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9వేల144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి RRB 2024 మార్చిలో  నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఖాళీలకు అదనంగా 5వేల154 పోస్టులను పెంచింది. దీంతో ఇప్పుడు మొత్తం ఖాళీల సంఖ్య 14వేల 298కి చేరింది. అదనంగా పెరిగిన పోస్టుల్లో సికింద్రాబాద్ జోన్ పరిధిలో 959 ఖాళీలు చేరాయి.

రైల్వే శాఖలో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 8న విడుదలకాగా.. మార్చి 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 8 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు లేదా నవంబర్ నెలల్లో సీబీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఈ పరీక్ష ద్వారా వివిధ రీజియన్ల పరిధిలోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ పోస్టులకు రూ.29వేలు. టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టులకు రూ.19వేల జీతంగా ఇస్తారు.