కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కళేబరం కలకలం

కామారెడ్డి జిల్లాలో  ఎలుగుబంటి కళేబరం లభ్యం కావడం కలకలం రేపుతోంది.  రామారెడ్డి మండలం రెడ్డిపేట-మద్దికుంట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని నందిబండ ప్రాంతంలో ఎలుగుబంటి కళేబరం లభ్యమైంది.  వేటగాళ్లు చంపారా లేదా ఆడవిలో నీరు దొరకక మృతి చెందిందా అనే కోణంలో అటవీశాఖ అధికారులు  దర్యాప్తు చేస్తున్నారు.  ఎలుగుబంటి తలభాగం ఒకచోట.. దాని వెంట్రుకలు,మిగతా భాగాలు మరోచోట లభ్యమయ్యాయి.  వేటగాళ్లు వేటాడి చంపి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   మండలంలో ప్రధానంగా అన్నారం, రెడ్డిపేట, సింగరాయపల్లి అటవీ ప్రాంతాల్లో జంతువుల వేట కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.