- డీసీపీ కోటేశ్వర రావు
నిజామాబాద్ క్రైమ్, వెలుగు : కొత్త నేర న్యాయ చట్టాల (భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)పై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని డీసీపీ కోటేశ్వరరావు సూచించారు. నిజామాబాద్ సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హల్లో కొత్త చట్టాలపై పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన విధానాల మీద సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ఎస్. శ్రీనివాస్ రావు, సీసీఆర్బీ సీఐ శ్రీనివాస్ రాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ కోర్టు కానిస్టేబుల్స్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.