విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : కృష్ణప్రసాద్

 హుజూరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీసీహెచ్‌‌‌‌ఎస్  కృష్ణప్రసాద్ హెచ్చరించారు. బుధవారం హుజూరాబాద్‌‌‌‌ ఏరియా హాస్పిటల్‌‌‌‌లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌‌‌‌లోని వార్డులను, డయాలసిస్ సెంటరు, ల్యాబ్, ఫార్మసీ, క్యాజువలిటీ విభాగాలను పరిశీలించారు. హాస్పిటల్‌‌‌‌లో అందిస్తున్న సేవలపై ఏవో డాక్టర్ నారాయణ రెడ్డి, డాక్టర్ సోమశేఖర్‌‌‌‌‌‌‌‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డీసీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ మాట్లాడుతూ డాక్టర్లు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలన్నారు. రోగుల పరిస్థితిని బట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడే చికిత్స అందించాలని, తప్పనిసరి పరిస్థితిలోనే వరంగల్ ఎంజీఎం, కరీంనగర్ సివిల్ ఆస్పత్రులకు రెఫర్ చేయాలని ఆదేశించారు.