డీసీసీబీ చైర్మన్​పై అవిశ్వాసానికి లైన్​ క్లియర్​

  • భాస్కర్​రెడ్డి పిటిషన్ కొట్టేసిన హైకోర్టు​
  • 15 రోజుల క్యాంప్​ తర్వాత తిరొగొచ్చిన డైరెక్టర్లు
  • రాజీనామాపై చైర్మన్​ తర్జనభర్జన

నిజామాబాద్​, వెలుగు: డీసీఓ ఉత్తర్వులతో నిర్వహించునున్న అవిశ్వాస సమావేశాన్ని రద్దు చేయాలని డీసీసీబీ చైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డి వేసిన పిటిషన్​ను హైకోర్టు బుధవారం కొట్టేసింది. దీంతో గురువారం జరగాల్సిన నో కాన్ఫిడెన్స్​ మీటింగ్​కు ఏర్పాట్లు చేస్తున్నారు. వైస్ ​చైర్మన్​ రమేశ్​రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాసాన్ని ప్రతిపాదించిన 15 మంది డైరెక్టర్లు బుధవారం గోవా క్యాంప్​ నుంచి నిజామాబాద్​కు తిరిగివచ్చారు. డైరెక్టర్లకు పోలీస్​ భద్రత కల్పించారు. అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉండడంతో భాస్కర్​ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా రాత్రి 10 గంటల ప్రాంతంలో  చైర్మన్​ పేరుతో తన పదవికి రాజీనామా చేశారంటూ ఓ లెటర్​ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీన్ని అధికారులు 

కోర్టు తీర్పు​పై కొనసాగిన ఉత్కంఠ

చైర్మన్​ భాస్కర్​రెడ్డిపై అవిశ్వాసం ప్రకటిస్తూ 15 మంది డైరెక్టర్లు సంతకాలు చేసి ఈ నెల 4న డీసీవో శ్రీనివాస్​రావుకు లెటర్​ అందించారు.15 రోజుల సమయమిస్తూ 21న స్పెషల్​ మీటింగ్​ నిర్వహిస్తున్నట్లు డీసీవో డైరెక్టర్లకు నోటీసులు పంపారు. బలపరీక్షలో నెగ్గేందుకు భాస్కర్​రెడ్డి ఇద్దరు డైరెక్టర్లను తనవైపు లాక్కోడానికి విశ్వప్రయత్నాలు చేశారు. సాధ్యం కాక హైకోర్టులో రెండు పిటిషన్లు వేశారు.

డైరెక్టర్లలో తన పట్ల ఉన్న అసంతృప్తిని తొలగించడానికి వారితో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ వేసిన పిటిషన్​ను గత మంగళవారం కోర్టు కొట్టేసింది. దీంతో డీసీవో శ్రీనివాస్​రావుకు నోకాన్ఫిడెన్స్​ మీటింగ్​ నిర్వహించే అధికారాలు లేవంటూ మరో పిటిషన్ వేశారు. మంగళవారం వాదనలు ముగియగా, కోర్టు తీర్పును రిజర్వ్​ చేసింది. హైకోర్టు ఆర్డర్స్​ ఎలా వస్తాయో అనే టెన్షన్​ కొనసాగిన వేళ బుధవారం పిటిషన్​ను కొట్టేస్తూ తీర్పు వెలువరిచింది.

అవిశ్వాసం నెగ్గితే..

భాస్కర్​రెడ్డిపై అవిశ్వాసం నెగ్గితే ఇన్​చార్జి చైర్మన్​ బాధ్యతల్లో వైస్​ చైర్మన్​ రమేశ్​​రెడ్డి కూర్చుంటారు. తర్వాత పూర్తి స్థాయి చైర్మన్​ ఎన్నికను నిర్వహిస్తారు. ఒకవేళ చైర్మన్​ భాస్కర్​రెడ్డి తన పదవికి రిజైన్​ చేస్తే, వెంటనే చైర్మన్​ ఎన్నిక చేపడతారు.

క్యాంప్​ నుంచి వాపస్​

బలపరీక్షలో నెగ్గడానికి చైర్మన్​ భాస్కర్​రెడ్డి డైరెక్టర్లను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించగా, ఆయనకు చిక్కకుండా మొత్తం 15 మంది ఒకేచోట క్యాంప్​లో ఉన్నారు. మొదట హైదరాబాద్​, తర్వాత గోవాకు మారారు. భాస్కర్​రెడ్డి పిటిషన్లను కొట్టేస్తూ కోర్టు తీర్పివ్వడంతో డైరెక్టర్ల టీం బుధవారం హైదరాబాద్​ చేరింది. మాజీ మంత్రి, బోధన్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డిని ఆయన ఇంట్లో కలిసి నోకాన్ఫిడెన్స్​ మీటింగ్​లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు.

ఉదయం 11 గంటలకు జరిగే మీటింగ్​కు అటెండయ్యేలా రాత్రే హైదరాబాద్​ నుంచి నిజామాబాద్​లోని ఒక హోటల్​కు చేరుకున్నారు. డైరెక్టర్ల సెక్యూరిటీ కోసం వారు ప్రయాణించే బస్సు, బస చేసే హోటల్​ వద్ద పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేశారు.