హైదరాబాద్‍లో ప్రభుత్వం నిర్ణయించి ధరలకంటే ఎక్కువ రేటుకు మందుకు అమ్ముతున్న ఓ కంపెనీపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు. బుధవారం జరిగిన ఈ దాడుల్లో హెటెరో హెల్త్ కేర్ కంపెనీ తయారు చేసిన ఇట్రాకోనజోల్ క్యాప్యూల్స్ BP mg ట్యాబ్లేట్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ మెడిసిన్ తయారీ పరిశ్రమ అస్సాంలోని కామ్రూప్ జిల్లా సింధూరిఘోపా గ్రామంలో ఉంది.
డ్రగ్ ఆర్డర్స్ 2013 ప్రకారం వీటి ధర నియంత్రణలో ఉంది. అయితే కంపెనీ వాటిని ఉల్లంఘించి సీలింగ్ ధర కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తోంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ప్రకారం... ఈ మందులు 12శాతం జీఎస్టీతో కలుపుకొని ఒక క్యాప్యూల్స్ రూ.24 మాత్రమే అమ్మాలి. కానీ, హెటెరో హెల్త్ కేర్ కంపెనీ ఒక క్యాఫ్యూల్స్ రూ.40 వరకు ధర పెంచి అమ్ముతుంది. ధరలను ఉల్లంఘించినందుకు కంపెనీ మందులు సీజ్ చేసినట్లు DCA డైరెక్టర్ జనరల్ VB కమలాసన్ రెడ్డి తెలిపారు.