IND vs BAN 2024: బంతి పడకుండా ముగిసే: రెండో రోజూ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు

కాన్పూర్ వేదికగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టుని వరుణుడు వదలడం లేదు. తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా రెండో రోజు ఆట పూర్తిగా రద్దయింది. వర్షం కారణంగా ఇరు జట్ల ప్లేయర్లు స్టేడియానికి చేరుకున్న కొద్ది సేపటికే తిరిగి హోటల్ రూమ్స్‌కి వెళ్లారు. మ్యాచ్‌లో ఇంకా 3 రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. తొలి రెండు రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే జరగడడంతో మిగిలిన 3 రోజుల పాటు పూర్తి ఆట సాగితేనే మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది.

ALSO READ | IND vs BAN 2024: కాన్పూర్ టెస్ట్‌కు వింత సమస్య.. కాపలాగా కొండముచ్చులు

ఉదయం నుంచి భారీగా పడుతున్న వర్షం లంచ్ సమయంలో తగ్గింది. అయితే పిచ్ పైన కవర్స్ నీళ్లతో నిండిపోయింది. ఈ లోపు మరోసారి వర్షం పడడంతో రెండో రోజు మ్యాచ్ ను నిలిపివేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. 9 ఏళ్లలో టాస్ గెలిచిన తర్వాత ప్రత్యర్థి జట్టుకి బ్యాటింగ్ అప్పగించిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ  నిలిచాడు. 

బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. 24 బంతులు ఆడిన జాకీర్ హసన్‌ పరుగులేమీ చేయకుండా ఆకాశ్ దీప్‌ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 36 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన షాద్మన్ ఇస్లాం కూడా ఆకాశ్ దీప్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (31), మోమినుల్ హక్ కలిసి మూడో వికెట్‌కి 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు మోమినుల్ హక్ (40), రహీం (6) క్రీజ్ లో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ కు రెండు.. అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది. ఇప్పటికే రెండో టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.