బ్రెయిన్​ భారం తగ్గించే మ్యాజిక్​ టూల్.. జీటీడీ

ఆఫీసుల్లో కొందరిని చూస్తే ‘వీళ్లు భలే మేనేజ్​ చేసుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు తప్ప అంత స్ట్రెస్​ ఫీలయినట్టు కనిపించరు. మేము కూడా అంతే కష్టపడుతున్నాం. కానీ చాలా స్ట్రెస్​ ఉంటోంది. వాళ్ల దగ్గర ఏం సీక్రెట్​ ఉందో!’ అనిపిస్తుంది. అలా స్ట్రెస్​ లేకుండా టెన్షన్​ ఫ్రీ లైఫ్​ గడిపేందుకు వాళ్ల దగ్గరున్న మ్యాజిక్​ టూల్​ జీటీడీ . అంటే... ‘గెట్టింగ్ థింగ్స్​ డన్ ( జీటీడీ)’ అన్నమాట. 

ఈ జీటీడీ గురించి డేవిడ్​ అల్లెన్​ అనే ఆయన ‘గెట్టింగ్ థింగ్స్​ డన్​ : ది ఆర్ట్​ ఆఫ్​ స్ట్రెస్​ ఫ్రీ ప్రొడక్టివిటీ’ అనే పుస్తకాన్ని రాశాడు. గెట్టింగ్​ థింగ్స్​ డన్​ – దీని​ థియరీ ఏంటంటే... బుర్రలో ఎక్కువ ఇన్ఫర్మేషన్​ ఉంచుకోవద్దు. దానివల్ల  ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఫోకస్​ ఉండదు. అందుకే బుర్రలో పెట్టుకోవాల్సిన సమాచారాన్ని బయట స్టోర్​ చేస్తారన్నమాట. 

బ్రెయిన్​ పవర్​ స్టోర్​ చేసేందుకు

నిజానికి బ్రెయిన్​ ఉన్నది ఇన్ఫర్మేషన్​ స్టోర్​ చేసుకునేందుకు కాదు. చేయాల్సిన పనులు, రిమైండర్స్​ వంటి వాటిని  బ్రెయిన్​లో పోగు చేయడం వల్ల... చేయాల్సిన పనికి తక్కువ బ్రెయిన్​ పవర్​ వాడాల్సి వస్తుంది. అందుకే చేయాల్సిన పనులను బ్రెయిన్​లో నుంచి పక్కకు తీసి టు–డు–లిస్ట్​ రాసుకుంటే... అప్పుడు చేయాల్సిన పని మీద బ్రెయిన్​ పవర్​ వాడొచ్చు” అంటారు ఈ థియరీని ఫాలో అయ్యే వాళ్లలో కొందరు. చేయాల్సిన పని గురించిన వివరాలను ఎక్స్​టర్నల్​గా స్టోర్​ చేయడం వల్ల ‘‘తరువాత నేనేం చేయాలి” అనే విషయం మీద అవగాహన ఉంటుంది. దానివల్ల వర్క్​ టెన్షన్​ దరి చేరదు. 

ఈ మెథడ్​ను సింపుల్​గా టైం మేనేజ్​మెంట్ స్ట్రాటజీ అనొచ్చు. చూస్తుంటే సింపుల్​గా అనిపిస్తున్న ఈ పద్ధతి ఫాలో అయితే దాని పవర్​ ఏంటో అర్థం అవుతుంది. మనకు తెలియకుండానే బ్యాక్​గ్రౌండ్​లో... చేయాల్సిన పనులను షఫ్లింగ్​ చేస్తూ, రీ అరేంజ్​ చేసుకుంటూ ఉంటుంది బ్రెయిన్. ఎప్పుడైతే కొత్త టాస్క్​ సిగ్నల్ మెదడుకి అందుతుందో... అప్పటివరకు ప్లాన్​ చేసిన లిస్ట్​ను కొత్తగా చేరిన టాస్క్​ ప్రాధాన్యత బట్టి మార్చుకుంటుంది. ఈ స్ట్రెస్​ నుండి బయటపడి వర్క్​ ప్రొడక్టివిటీ పెంచుకోవాలంటే జీటీడీ మెథడ్​ బెటర్​ అంటారు ఎక్స్​పర్ట్స్​. బ్రెయిన్​లో ఉండే ఆలోచనల క్లట్టర్​ను ఒక దగ్గర డంప్​ చేసి, వాటిని స్ట్రీమ్​లైన్​లో పెట్టేందుకు జీటీడీ పనికొస్తుంది. స్ట్రీమ్​లైన్​ చేశాక ఎలా పనిచేయాలనే నిర్ణయాలు తీసుకోవచ్చు.

ఇదెలా పనిచేస్తుందంటే...

ఈ పద్ధతిలో ప్రధానంగా ఐదు అంశాలు ఉంటాయి. వాటిని వాడి వర్క్​లోడ్​, ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.


క్యాప్చర్​ : చేయాల్సిన పనుల్ని ఆర్గనైజ్​ చేసుకోవడం కంటే ముందు క్యాప్చర్​ చేయాలి. ఇలా చేసే టూల్​ను ఇన్​ బాక్స్ అంటాడు ఈ పుస్తక రచయిత. పర్సనల్​ ప్రొడక్టివిటీ మెరుగుపర్చుకోవాలన్నా, వర్క్​ను ట్రాక్​ చేయాలన్నా ‘టు–డు– లిస్ట్​’ అవసరం. అదే టీం వర్క్​ అయితే వర్క్​ మేనేజ్​మెంట్​ ప్లాట్​ఫామ్​ ట్రై చేయాలి. దీనివల్ల మీ వర్క్​ను క్యాప్చర్​ చేసి ట్రాక్​ చేయొచ్చు. టీం వర్క్​ను మేనేజ్​, ఆర్గనైజ్​ చేయడం కూడా ఈజీ. ఇలా క్యాప్చర్​ చేసినప్పుడు వర్క్​ సరిగా ఆర్గనైజ్​ లేదా డాక్యుమెంట్​ చేయకపోయినా బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే బ్రెయిన్​లో ఉన్న స్టఫ్​ను ఎక్స్​టర్నల్​గా స్టోర్​ చేస్తారు కాబట్టి.


క్లారిఫై : రాసిన విషయాల గురించి ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడే ఒక్కో టాస్క్ పూర్తి చేసేందుకు ఎలా వర్క్​ చేయాలనే ఐడియా వస్తుంది. ఆ తరువాత ఆర్గనైజ్​ చేయాలి. టాస్క్​ ప్రాధాన్యత బట్టి పని చేసుకోవాలి. ప్రయారిటీ లిస్ట్​ రాసుకున్నా కూడా... తక్కువ టైం పట్టే వాటిని ముందు పూర్తి చేయాలి. దానివల్ల ఆ పని మీ మైండ్​ నుంచి పోతుంది. ‘టు–డు–లిస్ట్​’ నుంచి డిలీట్​ అవుతుంది. ఆ పని మీది కాకపోతే వెంటనే సంబంధిత వ్యక్తికి అసైన్​ చేయాలి. 

ఆర్గనైజ్​ : ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపట్ల ఒక క్లారిటీ వచ్చిందంటే... టాస్క్​, చేయాల్సిన పనుల​ లిస్ట్​ దగ్గర ఉన్నట్టే. ఆ లిస్ట్​ను ఆర్గనైజ్​ చేసుకుంటే వర్క్​ క్యాలెండర్​ రెడీ అయినట్టే. అందులో ఉన్న డేట్స్​, రిఫరెన్స్​ల​ బట్టి పనులు సరిగా అవుతున్నాయా? లేదా? చెక్​ చేసుకునే షెడ్యూల్​ పెట్టుకోవాలి. ‘టు–డు–’ లిస్ట్​లో ఉన్న వాటిని యాక్షనబుల్​ టాస్క్​గా మార్చారంటే క్లారిఫై, ఆర్గనైజ్​ స్టెప్స్​ తరువాత ఇన్​బాక్స్ ఖాళీ అయిపోతుంది.

రిఫ్లెక్ట్​ :  ఈ స్టెప్​ జారుడు బండలాంటిది. అందుకే దీన్ని రోజులో వర్క్​ మొదలుపెట్టినప్పుడు, రోజు అయిపోయేటప్పుడు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాలెండర్​ను రీ–ఆర్గనైజ్​ చేసుకునే వీలుంటుంది. బుర్ర మీద భారం పడకుండా ఉండేందుకు తయారుచేసిందే జీటీడీ మెథడ్​. మరి అలాంటప్పుడు రిఫ్లెక్ట్​ మెథడ్​ని ఒకటికి పదిసార్లు చెక్​ చేసుకుంటూ భారాన్ని పెంచుకుంటే ఎలా? అందుకే చేస్తున్న పనిని బట్టి వారానికి ఒకసారి వీక్లీ రివ్యూ చేసుకోవాలి.


ఎంగేజ్​ : బుర్రని క్లియర్​ చేసుకుని వర్క్​ ఆర్గనైజ్​ చేసుకున్నాక పనులు చేయడం మిగులుతుంది. ఎప్పుడు చేయాలి? ఏం చేయాలి? అంటూ స్ట్రిక్ట్​ రూల్స్​ ఏమీ ఉండవు. అయితే ఎక్కడినుంచి మొదలుపెట్టాలి? ఎలా మొదలుపెట్టాలి? అనే విషయంలో కన్​ఫ్యూజన్​ ఉంటే ఎంగేజ్​మెంట్​లోకి వెళ్లే ముందు నాలుగు విషయాలను చెక్​ చేసుకోవాలి. అవి...


 ప్రయారిటీ: ఉన్న టాస్క్​ల్లో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఆ రోజు చేయాల్సింది ఏమిటి?


కాంటెక్ట్స్​ :  బ్రెయిన్​ ఎలాగైతే మల్టీటాస్కింగ్​ చేయలేదో అలానే ఈ పద్ధతి కూడా. అందుకే టైం బ్లాకింగ్​ మెథడాలజీ వాడాలి. ఒకేలాంటి పనులన్నిం టినీ ఒకే టైంలో చేయాలి.


టైం అవైలబుల్ : టైం బట్టి టాస్క్​ సెలక్ట్​ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టైం సరిపోవడం లేదని మధ్యలో టాస్క్​ వదిలేయాల్సిన అవసరం రాదు.

ఆఫీసుల్లో కొందరిని చూస్తే ‘వీళ్లు భలే మేనేజ్​ చేసుకుంటారు. ఎప్పుడో ఒకప్పుడు తప్ప అంత స్ట్రెస్​ ఫీలయినట్టు కనిపించరు. మేము కూడా అంతే కష్టపడుతున్నాం. కానీ చాలా స్ట్రెస్​ ఉంటోంది. వాళ్ల దగ్గర ఏం సీక్రెట్​ ఉందో!’ అనిపిస్తుంది. అలా స్ట్రెస్​ లేకుండా టెన్షన్​ ఫ్రీ లైఫ్​ గడిపేందుకు వాళ్ల దగ్గరున్న మ్యాజిక్​ టూల్​ జీటీడీ . అంటే... ‘గెట్టింగ్ థింగ్స్​ డన్ ( జీటీడీ)’ అన్నమాట.  థియరిటికల్​ కెపాసిటీ ఎంత ఉన్నా పని చేసే వ్యక్తి కెపాసిటీ ఎంత అనేది చూసుకోవా లి. 

పని చేయాలనిపించనప్పుడు బలవంతంగా పని చేస్తే... ఆ పని చేసేందుకు పట్టే టైం కంటే రెట్టింపు టైం పడుతుంది. ఇలాంటప్పుడు చేసే పనుల్లో మనసుకు నచ్చిన పని చేయాలి. అది కూడా చాలా తక్కువ ప్రయారిటీ ఉన్నది. అప్పుడు మీలో శక్తి పెరుగుతుంది. పనిచేసే మూడ్​ వస్తుంది.


ప్రొడక్టివ్​ వర్క్​ కోసం కాస్త ఒత్తిడి ఉంటే ఓకే! కానీ ఆ  ఒత్తిడి ఎక్కువయితే దాని ఎఫెక్ట్స్​ వేరుగా ఉంటాయి. అందుకే జీటీడీ మెథడ్​ వాడి పనికొచ్చేలా ఒక సిస్టమ్​ డెవలప్​ చేసుకుంటే అనవసరమైన ఒత్తిడి బారిన పడరు. అప్పుడు చేయాల్సిన పనుల్లో అత్యవసరం అనుకున్న వాటి మీద దృష్టి పెట్టొచ్చు.