మానవత్వం మంటగలిసిపోతోంది. చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా పోతోంది. వృద్ధులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నారు. లేటెస్ట్ గా వృద్ధుడని చూడకుండా మామను చితక్కొట్టింది ఓ కోడలు. వీల్ ఛైర్ లో కూర్చున్న మామ దగ్గరకు వచ్చిన కోడలు చెప్పుతో కొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో జరిగింది.
నవంబర్ 20న ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన వైరల్ అవుతోంది. మామపై విచక్షణారహితంగా దాడి చేసింది కోడలు. వీల్ చైర్ లో కూర్చున్న మామ మొఖంపై పదే పదే చెప్పుతో కొట్టింది. కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించకుండా చితకబాదింది.
ALSO READ | ఇంట్లో అందరూ ఉండగానే.. 46 తులాల బంగారం చోరీ
సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తండ్రిలాంటి వ్యక్తిపై అలా దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.