తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే : దాసు సురేశ్​

  • బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్​

నిజామాబాద్, వెలుగు : తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమేనని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు.  నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షుడు నాగయ్య నేతృత్వంలో శనివారం బీసీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు సురేశ్ మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం కోసం దృఢంగా పోరాడితే అగ్రవర్ణాలు  అధికార కుర్చీలు ఖాళీ చేయడం ఖాయమన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలది అవకాశవాద రాజకీయమేనని, జాతీయ పార్టీలు ఓబీసీలను అమాయకులను చేసి మోసపూరిత విధానాలను అనుసరిస్తున్నాయని ఆరోపించారు.

 త్వరలో అన్ని మండలాల్లో బీసీ కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి రాజకీయ చైతన్యం తీసుకొస్తామన్నారు.ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు హైమావతి, రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కిషోర్, నిజామాబాద్ ఉపాధ్యక్షుడు అల్లుళ్ల నారాయణ, హనుమకొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు జూలూరి రమేశ్​గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి పద్మావతి, బీసీ లెక్చరర్స్ జేఏసీ స్టేట్ కన్వీనర్ కాముని సుదర్శన్, కరీంనగర్ బాధ్యులు కుమార్ గౌడ్, నిజామాబాద్ ఉపాధ్యక్షుడు కరాటే రమేశ్, సలహాదారులు నామాల శంకర్, ఉస్కెల గంగారాం, కామారెడ్డి ఇన్​చార్జి సూర్య మల్లేశ్, సహాయక ఇన్​చార్జి చింతల శంకర్, సోషల్ మీడియా ఇన్​చార్జి రాజేందర్, కరీంనగర్ మహిళా విభాగం ఇన్​చార్జి  సామనపల్లి లక్ష్మి, స్వరూప గౌడ్ తదితరులు పాల్గొన్నారు.