బాల్కొండ, వెలుగు: స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం స్టేట్ సెక్రటరీ దాసరి మూర్తి డిమాండ్ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన మహా సభకు ఆయన హాజరై మాట్లాడారు. బీసీ కుల గణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ప్రకటించాలన్నారు. త్వరలో బీసీ పొలిటికల్ పార్టీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ నుంచి వ్యాపార, వ్యవసాయ,విద్యా రంగాలకు సబ్సిడీ లోన్లు మంజూరుచేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం దాసరి మూర్తిని పలువురు శాలువాతో సత్కరించారు. స్టేట్, డిస్ట్రిక్,నియోజకవర్గ,మండల కమిటీలను ఎన్నుకున్నారు.నిజామాబాద్ డిస్ట్రిక్ వైస్ ప్రెసిడెంట్ గా సూరినీడ దశరథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుభాష్ గౌడ్,బాల్కొండ ప్రెసిడెంట్ గా బండి మల్లేశ్, కమ్మర్పల్లి ప్రెసిడెంట్ గా చింత గణేశ్, ముప్కాల్ ప్రెసిడెంట్‌గా గోపిరాంను నియమించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం డిస్ట్రిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర శ్యామ్, బాల్కొండ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.