పాములను అమ్మటం చూశాం.. పాము విషాన్ని అమ్మటం చూశాం.. ఇప్పుడు కొత్తగా కప్పలను అమ్ముతున్నారు.. ఈ కప్ప అలాంటిది ఇలాంటిది కాదు.. ఇలాంటి ఒక కప్ప 2 లక్షల రూపాయలు పలుకుతుంది.. దీని ప్రత్యేకత ఏంటీ అంటారా.. ఈ కప్పకు నిలువెల్లా విషమే.. ఈ కప్ప విషంతో.. నిమిషంలోనే ఆరు అడుగుల మనిషిని చంపొచ్చు అంటా.. అయినా సరే ఈ కప్పకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. మార్కెట్లో దీని ధర రూ. 2 లక్షలు. ... అంత విషపూరితమైన కప్పకు ఎందుకు అంత ధర అనుకుంటున్నారా..అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
మనిషిని చంపే వాటిల్లో పాములు, పులులు లాంటివే ఉంటాయి అనుకోవడానికి లేదు.చీమలు కూడా చంపగలవు.చీమలకు భయపడి ఒక ఊరు ఊరే ఖాళీ అయింది.మిడతలు భయపడి వలసలు పోయిన ఘటనలు ఉన్నాయి.కప్పలు అంత డేంజరెస్ కావనుకుంటారేమో.కప్పల్లో కూడా విషపూరితమైన కప్పలు ఉన్నాయి. చూసేందుకు అందంగా ఉంటాయి కానీ.ఒళ్ళంతా విషమే.ఈ కప్పలను గోల్డెన్ పాయిజన్ కప్పలు అంటారు.అవి సాధారణంగా రెండు అంగుళాలు లేదా కొంచెం పెద్దవి లేదా చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ కప్పలు పది మందిని చంపేంత విషం ఇందులో ఉండటం గమనార్హం.శతాబ్దాలుగా కొలంబియాలోని వేటగాళ్ళు తమ ఎరను పట్టుకోవడానికి ఈ రకమైన కప్ప విషాన్ని ఉపయోగిస్తారట. వీటి ధర లక్షల్లో పలుకుతుంది. అంటే ఒక కప్ప ఖరీదు దాదాపు రూ. 2 లక్షలు ఉంటుంది.
ఈ రకమైన కప్పలను వైద్య రంగంలో ఉపయోగిస్తారు. వీటి విషంతో ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.దీని ద్వారా శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్‌లను తయారు చేస్తారు.. కొలంబియాకు చెందిన ఓఫాగా కప్పకు డిమాండ్ ఇప్పటికీ అత్యధికంగా ఉంది. అంతే కాకుండా ఇవి చాలా అందంగా కనిపించడంతో ధనవంతులు వాటిని తమ ఇళ్లలో ఉంచుకుంటారు. గతంలో అమెరికా, బ్రిటన్ తదితర యూరప్ దేశాల్లో వీటికి విపరీతమైన గిరాకీ ఉండేది. ప్రస్తుతం ఇప్పుడుఆసియాలో కూడా దిగుమతి చేసుకుంటున్నారు.
ఒక కప్పలోని విషంతో 20 వేల ఎలుకలను చంపొచ్చంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కప్పను మనం ముట్టుకోగానే విషం ఎక్కదు. నోట్లో పెట్టుకుంటేనో.. కళ్లు, ముక్కుకు తగిలితేనో లేదా ఏదైనా గాయం ఉన్నచోట ఈ కప్ప విషం అంటితేనో.. ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషం వల్ల రక్తనాళాలు కుచించుకుపోవడం, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. పాయిజన్ డార్ట్ కప్పల్లో రెండు వందలకు పైగా జాతులు ఉన్నాయి. .
దీనిని పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ అంటారు. ఈ విష జీవుల రంగును ప్రజలు చాలా ఇష్టపడతారు. ఈ కప్పలకు పసుపు మరియు నలుపు చారలు ఉంటాయి. కొన్ని కప్పలు ఆకుపచ్చ రంగులో కూడా ఉంటాయి. ప్రకాశవంతమైన నారింజ రంగు మచ్చలను కలిగి ఉంటాయి. కప్పల వైవిధ్యం పరంగా ఇది ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. ఈ మచ్చల కప్పలు 100 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి.వాటి సగటు పొడవు ఒక అంగుళం కంటే ఎక్కువ ఉంటుంది.చాలా కప్ప జాతులు కొలంబియాలోని పసిఫిక్ తీరంలో రెయిన్‌ఫారెస్ట్‌లోని చిన్న పాచ్‌లో నివసిస్తున్నాయి.
ఈ కప్పల స్మగ్లింగ్ చాలాభిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ కప్పల ఎగుమతిని... దిగుమతిని నిషేధించాయి. ఐరోపా ... వీటిపై ఆధారపడి జీవిస్తూ అమెరికాలోని అనేక కుటుంబాలు ఉన్నాయి. వీటికి చాలా డిమాండ్ ఉండటంతో .. అక్రమ రవాణా కూడా చేస్తున్నారు. ఇవి కొలంబియాలో కనిపిస్తాయి. అక్కడ నుంచే ప్రపంచవ్యాప్తంగా అక్రమంగా రవాణా జరుగుతాయి. కాని వీటిని చాలా అరుదుగా పట్టుకుంటారు. ఆకుపచ్చ మరియు నలుపు కప్పలు, కోకో కప్పలు మరియు బంగారు కప్పలు చాలా అరుదుగా లభిస్తాయి.