స్కానింగ్​ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి : దండి వెంకటి

నిజామాబాద్​అర్బన్, అర్బన్:  వైద్య పరీక్షల కోసం వచ్చే మహిళలు, యువతుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న స్కానింగ్ ​సెంటర్లపై  కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్​ఫ్రంట్​రాష్ట్ర కన్వీనర్​ దండి వెంకటి డిమాండ్​చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్​ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

స్కానింగ్​ సెంటర్​ సిబ్బంది మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వారి న్యూడ్​వీడియోలు తీసి వేధించడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో  నాయకులు జ్యోతి, లత, రాజు తదితరులు పాల్గొన్నారు.