సిరిసిల్లలో డబుల్ ఇండ్ల కోసం  దళితుల పోరుబాట

  • గతంలో ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చిన స్థలంలో డబుల్‌‌‌‌‌‌‌‌ ఇండ్ల నిర్మాణం 
  • భూములిచ్చినవారికే ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ 
  • నిర్వాసితులకు హామీ ఇచ్చి మరిచిన గత సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
  • కొన్ని రోజులుగా ఆందోళనకు దిగుతున్న వైనం 

రాజన్నసిరిసిల్ల, వెలుగు:1984లో నాటి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇందిరమ్మ పథకం కింద సిరిసిల్లలోని దళితులకు శాంతినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు 10 ఎకరాల్లో ఇండ్లు నిర్మించి ఇచ్చింది. ఈ ఇండ్లు క్రమంగా శిథిలావస్థకు చేరుకోగా గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ స్థలాన్ని సేకరించి ఆ భూమిలో డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్లు నిర్మించింది. ఇండ్ల కేటాయింపులో నిర్వాసిత దళితులకే ప్రయారిటీ ఇస్తామని చెప్పింది. ఈ హామీ నెరవేర్చకపోవడంతో భూములిచ్చిన దళితులు ఆందోళనలు చేస్తున్నారు. 

పదెకరాల్లో 205 డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్లు 

1984లో ఇందిరమ్మ పథకం కింద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శాంతినగర్ లో  249,257, 261,262, సర్వేనంబర్లలో ఇండ్లు నిర్మించి ఇచ్చింది. ఈ ఇండ్లు శిథిలావస్థకు చేరుకోగా 2018లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్​ చొరవతో సంబంధిత స్థల యజమానులు ఆ భూమిని సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు. దీనిలో సుమారు 205 డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. భూములు ఇచ్చిన ప్రతి దళితబిడ్డకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ లీడర్లు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ సంగతే మరిచిపోయారు. నిర్మాణం పూర్తయినా వీటిని లబ్ధిదారులకు అందజేయడంలో గత సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెయిలైంది.

తాజాగా వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతుండగా నిర్వాసితులు నిరసనలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ హామీతోనే తాము భూములు ఇచ్చామని వాపోయారు. ముందుకు తమకు ఇండ్లు ఇచ్చాకే ఇతరులకు పంపిణీ చేయాలని పట్టుబడుతున్నారు. మూడు రోజుల కింద శాంతినగర్ డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద రోడ్డుపై బైఠాయించారు. తాజాగా సోమవారం అంబేద్కర్ నగర్ నుంచి పెద్దసంఖ్యలో దళితులు, మద్దతుదారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 

కౌన్సిలర్ల రాజకీయం

శాంతినగర్ డబుల్ బెడ్రూం ఇండ్లపై కొంతమంది కౌన్సిలర్లు రాజకీయం చేస్తూ ప్రజల్లో కన్ఫ్యూజన్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. నాలుగు రోజుల కింద శాంతినగర్ డబుల్ఇండ్లను లబ్ధిదారులను కేటాయిస్తున్నారని పుకార్లు రావడంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వారు శాంతినగర్ డబుల్ ఇండ్ల వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ దళితులు భూములిచ్చి త్యాగాలు చేసిన తమకే కేటాయించాలని ఆందోళనకు దిగారు. రెండు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. 

ఇండ్లు ఎవరికీ కేటాయించలేదు

ఇప్పటివరకు డబుల్ ఇండ్లను ఎవరికీ కేటాయించలేదు. ఇంతవరకు అర్హులను గుర్తించలేదు. ఎవరైనా డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దకు ఆక్రమించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శాంతినగర్ డబుల్ ఇండ్ల పంపిణీ కోసం ప్రభుత్వ నుంచి ఎలాంటి విధివిధానాలు అందలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ముందుకెళ్తాం. - రమేశ్‌‌‌‌‌‌‌‌, ఆర్డీవో సిరిసిల్ల