బుర్ర బాగా పని చేయాలంటే.. రోజూ 4 వేల అడుగులు నడవాలి

మెరుగైన మెదడు ఆరోగ్యం కోసం రోజుకు 4వేల  అడుగులు వేసినా చాలని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్‌లో గత నెలలో ప్రచురించిన ఓ అధ్యయనాన్ని  పరిశీలించగా రోజుకు కొన్ని వేల అడుగులు మాత్రమే వ్యాయామం చేయడం కూడా మెదడు వాల్యూమ్‌తో ముడిపడి ఉంటుందని తేలింది.

శారీరకంగా చురుకుగా ఉండటం మెదడుకు మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం జ్ఞాపకశక్తి తగ్గే ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుందని పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మెదడు పనితీరు అభివృద్ది చెందాలంటే వాకింగ్​ అవసరమని వైద్య పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతిరోజూ 4వేల అడుగులు నడవడం వలన   మెదడుకు రక్తప్రసరణలో ఎలాంటి ఇబ్బంది ఉందదు, మెదడు కావలసిన  పోషకాలు ,  ఆక్సిజన్‌ను పంపిణీ చేస్తుంది.  నడక నాడీ మార్గాలను బలోపేతం చేస్తుంది.   నడక  డోపమైన్,  సెరోటోనిన్ వంటి న్యూరోకెమికల్స్ ఉత్పత్తి  చేస్తుంది, ఇవి మానసిక స్థితిని నియంత్రించి జ్ఞానాన్ని అభివృద్ది చేయడంలో  కీలక పాత్ర పోషిస్తాయి.  

మెదడు పరిమాణం మన ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. రోజుకు 4వేల అడుగుల కంటే తక్కువ నడక శరీరక శ్రమ కూడా మెదడు ఆరోగ్యం పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందట. ఈ విషయంగా 10 వేల 125 మంది పాల్గొన్నవారిలో, సగటు వయస్సు 52 సంవత్సరాలు, వారి వ్యాయామ స్థాయిలకు సంబంధించి వారి మెదడు వాల్యూమ్‌ను కొలవగా, శరీర మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్‌లలో తేలిందేమంటే..నడిచినా, పరుగెత్తినా లేదా క్రీడలు ఆడినా, మితమైన, చురుకైన కార్యాచరణలో నిమగ్నమైన వ్యక్తులలో గుండె, ఊపిరితిత్తులను కనీసం 10 నిమిషాల పాటు పంపింగ్ చేసే వ్యాయామం..రోజూ 45 నిమిషాల పాటు మితమైన వ్యాయామం, సమస్య పరిష్కార నైపుణ్యాలు, జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుందని తేలింది.

వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలపై ఆర్థరైటిస్ ఫౌండేషన్ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ప్రతిరోజూ నడక కండరాలను బలపరుస్తుంది, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, వశ్యతను పెంచుతుంది. ఇది కాకుండా, నడక వల్ల వృద్ధులలో కీళ్ల దృఢత్వం, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి మరియు జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి ప్రమాదాలు తగ్గుతాయి. 2020 సంవత్సరం నుండి జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు   4 వేల  అడుగులు వేసిన వారి కంటే ఏ కారణం చేతనైనా చనిపోయే ప్రమాదం 51శాతం తక్కువ. 

వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్రహిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్రమంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్యర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్యలు దూర‌మ‌వుతాయి. రోజూ వ్యాయామం చేయడం, అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవడం పట్ల ఇటీవల చాలా మంది శ్రద్ధ చూపిస్తున్నారు. ఒక్కపైసా ఖర్చు పెట్టకుండా శరీరం బరువు తగ్గించుకోవడంలో నడక ఎంతగానో సహాయపడుతుంది. జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్దనే ఎంచక్కా వాకింగ్‌ చేయొచ్చు.

నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్రత పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి. నిత్యం వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నడక వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 31 శాతం వరకు తగ్గుతుందని, సీవీడీ సమస్యలతో మరణాల ప్రమాదం 32 శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.

కేవలం 4వేల అడుగులు నడిస్తే చాలు.. ఎలాంటి అనారోగ్య కారణంతో అయినా కలిగే ఆకస్మిక మరణం నుంచి తప్పించుకోవచ్చట. ఇక కార్డియో వాస్క్యూలార్ జబ్బుల నుంచైతే ఇంకా తక్కువ నడిచినా సరే గణనీయమైన రక్షణ లభిస్తుందనేది నిపుణుల అభిప్రాయం.60 సంవత్సరాలు పైబడిన వారు రోజుకు 4 వేల    అడుగులు మధ్య నడిస్తే వారికి గుండె జబ్బు వచ్చే ప్రమాదం 42 శాతం వరకు తగ్గుతుందని ఒక అంచనా. ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిదని ఈ అధ్యయనం నిర్ధారిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరికీ ఇది వర్తిస్తుందని తాము కనుగొన్నట్టు ఈ అధ్యయనకారులు స్పష్టం చేస్తున్నారు.