ఉద్యోగాలు ఇప్పిస్తామని కాంబోడియా తీసుకెళ్లి ఆపని చేయిస్తున్నారు

టెక్నాలజీ వాడుకోవడంతో మన కంటే ముందున్న కొన్ని దేశాలు కంప్యూటర్ ముందు కూర్చొని కోట్లు కొళ్లగొడుతున్నారు. ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి ఇండియా నుంచి తీసుకెళ్లి బలవంతంగా సైబర్ క్రైమ్స్ చేస్తున్నారని కొలంబియాలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. డిజిటల్ అరెస్ట్ టెక్నిక్స్ ద్వారా స్కామర్లు ప్రతిరోజూ సుమారు రూ.6 కోట్లు మాయం చేస్తున్నారని హోం మంత్రిత్వ శాఖ సైబర్ వింగ్ వర్గాలు తెలిపాయి. కంబోడియా వంటి ఆగ్నేయాసియా దేశాలు ఈ మోసాలకు కేంద్రంగా ఉన్నాయని కొన్ని నేషనల్ మీడియా సంస్థలు చేసిన రీసెర్చ్ లో తేలింది.

టూరిస్ట్ వీసాలపై వచ్చి అక్రమంగా కాంబోడియాలో జాబ్ చేయోద్దని కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అలా వచ్చిన వారు ఎక్కువగా అక్కడ సైబర్ క్రైమ్స్ కు పాల్పడుతున్నట్లు ఇండియన్ రాయబారి కార్యాలయం చెప్పింది. కంబోడియా, మయన్మార్ మరియు వియత్నాం దేశాలు ఎక్కువ జీతం ఆశ చూపించి ఇండియన్స్ ను రప్పించుకొని వారితో బలవంతంగా ఆర్థిక మోసాలు చేయిస్తున్నారు. అలాంటి మోసాల నుంచి సేకరించిన డబ్బును దుబాయ్ మరియు వియత్నాంలోని ATMల నుండి విత్‌డ్రా చేస్తారు. 

సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా కంబోడియాలోని చైనీస్ క్యాసినోలలో ఉన్న కాల్ సెంటర్ల నుంచి పనిచేస్తున్నారని హోం మంత్రిత్వ శాఖ కనిపెట్టింది. అక్టోబర్ వరకు సైబర్ విభాగం డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించి 92,334 కేసులు నమోదు చేసింది. ఈ ఏడాది తొలి 10 నెలల్లోనే స్కామర్లు రూ.2,140 కోట్లు స్వాహా చేశారు. కంబోడియా, మయన్మార్ మరియు వియత్నాంలోని సైబర్ నేరగాళ్లు తమ ఏజెంట్ల కోసం ఇండియన్ సిమ్ కార్డ్‌లను ఆర్డర్ చేస్తారు. దాదాపు 45,000 సిమ్‌కార్డులను కంబోడియా, మయన్మార్‌లకు పంపినట్లు విచారణలో తేలింది. తర్వాత భారతీయ ఏజెన్సీలు సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేశాయి.