డిజిటల్ అరెస్ట్​ల పేరిట రూ. 237 కోట్లు లూటీ

  • రాష్ట్రంలో 10 నెలల్లో 3,238 మోసాలు.. 3 వేల మంది బాధితులు

హైదరాబాద్‌‌, వెలుగు: డిజిటల్ అరెస్టుల పేరుతో కొత్త రకం దందాకు తెరతీసిన సైబర్ నేరగాళ్లు మన రాష్ట్రంలోనూ జనానికి దడ పుట్టిస్తున్నారు. ఆన్‌‌లైన్‌‌ ఇంటరాగేషన్‌‌, డిజిటల్ అరెస్ట్ అని బాధితులను బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. రాష్ట్రంలో గత 10 నెలల్లోనే ఏకంగా 3,237 మంది బాధితులను డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించిన అంతర్రాష్ట్ర ముఠాలకు చెందిన కేటుగాళ్లు రూ. 237 కోట్ల వరకూ లూటీ చేశారు.

తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని(74) నుంచీ రూ. 37 లక్షలు లూటీ చేసిన ఘటన వెలుగుచూసింది. సైబర్ చీటర్స్ ఢిల్లీ, ముంబై, యూపీ, కోల్‌‌కతా కేంద్రంగా వరుసగా నేరాలకు పాల్పడుతున్నారు. క్రైమ్ బ్రాంచ్‌‌, సీబీఐ, ఈడీ, కస్టమ్స్‌‌ అధికారులమని చెప్పుకుంటూ బ్లాక్‌‌ మెయిల్ చేస్తున్నారు. స్కైప్‌‌, వాట్సాప్‌‌ వీడియో కాల్స్ చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

ఈ ముఠాల చేతుల్లో చిక్కిన బాధితులు గంటల కొద్దీ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడడంలేదు. రోజురోజుకూ పెరిగిపోతున్న డిజిటల్‌‌ అరెస్ట్‌‌ నేరాలు, క్రిమినల్స్‌‌ గురించి ప్రధాని మోదీ కూడా ఇటీవల హెచ్చరించారంటేనే.. దేశంలో ఈ నేరాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  

పోలీసులకు చిక్కకుండా లూటీ.. 

రాష్ట్రవ్యాప్తంగా ఏటా సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. మొదట్లో లాటరీ ఫ్రాడ్స్, ఓఎల్‌‌ఎక్స్‌‌ ఓటీపీ ఫ్రాడ్స్‌‌ ఎక్కువగా జరిగేవి. ప్రజల్లో అవగాహన రావడంతో ఈ రకం నేరాలు కాస్త తగ్గాయి.  ఆ తరువాత జనం ఆశను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ట్రేడింగ్‌‌, ఇన్వెస్ట్​మెంట్‌‌ మోసాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఫెడెక్స్ కొరియర్, డ్రగ్స్ పార్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముంబై క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ, సీబీఐ, ఈడీ పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నారు.

డిజిటల్ అరెస్ట్, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఇంటరాగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో ఈ ఏడాది మన రాష్ట్రంలో10 నెలల వ్యవధిలోనే 3,237 మంది బాధితుల నుంచి రూ.237.11 కోట్లు దోచేశారు. వీటికి సంబంధించి సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరోతో పాటు గ్రేటర్ లోని మూడు కమిషనరేట్ల సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా వర్చువల్ ఫోన్ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిక్కినా సైబర్ నేరగాళ్లు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు.  

సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు 

ఢిల్లీ, ముంబై, నోయిడా, గుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూపీ, వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సైబర్ ముఠాలు ఎక్కువగా వరుస సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాలోని ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలను టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేసుకుంటున్నారు. నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాతో పోల్చితే సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హిందీ మాట్లాడే వారి సంఖ్య తక్కువ.

హైదరాబాద్ మినహా చాలా ప్రాంతాల వారికి హిందీ సరిగా అర్థం కాకపోవడంతో పాటు ఎదురు ప్రశ్నించరనే ధీమాతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెంట్ల నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా ఇతర ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీల ద్వారా ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇతర సైబర్ నేరాల్లో నైపుణ్యం పొందిన నేరగాళ్లే ప్రస్తుతం డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెరతీశారు. 

పోలీస్ డ్రెస్ లో వీడియో కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 

సైబర్ నేరగాళ్లు సేకరించిన ఫోన్ నంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మొదట ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వార సమాచారం అందిస్తారు. మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా ఇతర నేరాలు చేస్తున్నారని గుర్తించినట్టు తెలుపుతారు. ఆ ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 20కి పైగా కేసులు రిజిస్టర్ అయినట్లు చెప్తారు. అత్యవసరంగా కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందిస్తారు. స్పందించని వారికి మళ్ళీ మళ్ళీ మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పంపిస్తుంటారు.

అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జారీ అయ్యిందని ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోలు పంపిస్తారు. ఆ తరువాత సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లే కాల్ చేస్తారు. ఢిల్లీ, ముంబై క్రైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మాట్లాడుతున్నామని చెప్తారు. అరెస్ట్ చేసేందుకు వస్తున్నట్లు భయపెడతారు. బాధితుల మానసిక పరిస్థితిని గమనిస్తారు. వారు భయపడుతున్నట్లు గుర్తించిన తరువాత మరో ప్లాన్ అమలు చేస్తారు. 

వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటరాగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

డిజిటల్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటరాగేషన్ చేస్తున్నట్లు నమ్మిస్తారు. స్కైప్ లేదా వాట్సాప్ ద్వారా వీడియో కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారు. పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లుగా పోలీస్ యూనిఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కనిపిస్తారు. బాధితుల ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు, బ్యాంక్ డిటైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటారు. వీటిని పరిశీలిస్తున్నట్టు నటిస్తుంటారు. ఓ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూర్చుని మాత్రమే ఇంటరాగేషన్ ఎదుర్కోవాలని సూచిస్తారు. ఎవరికైనా చెప్పినా, కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినా.. వెంటనే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. బాధితులు తేరుకునే లోపు.. వారి పేరుతో ఫేక్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారెంట్స్, ఆర్బీఐ, ఈడీ నోటీసులు వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పంపిస్తుంటారు.

దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్స్ ఉన్నాయని బెదిరిస్తారు. కొద్దిసేపట్లో సిమ్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్ కనెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుందని చెప్తారు. ఇన్వెస్టిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా డిజిటల్ అరెస్ట్ చేశామంటారు. ఉన్నతాధికారి మాట్లాడుతాడని మరొకరితో మాట్లాడిస్తారు. ఇలా గంటల కొద్ది వీడియో కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉంచుతారు. చివరికి డీల్ కుదుర్చుకుంటే కేసు నుంచి తప్పిస్తామని నమ్మిస్తారు. వీలైనకాడికి డబ్బును అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటారు.   

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని(80)కి ట్రాయ్ డిపార్ట్ మెంట్ పేరుతో కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. సిమ్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆధార్ కార్డును డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామని చెప్పారు. ఆ తరువాత లక్నో పోలీస్ స్టేషన్ నుంచి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐని మాట్లాడుతున్నా అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వృద్ధురాలి పేరుపై ఉన్న మొబైల్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అక్రమ ప్రకటనలు, వేధింపులకు గురిచేసే మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మనీలాండరింగ్ కు సంబంధించి కేసులు నమోదైనట్లు బెదిరించారు. డిజిటల్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇలా రూ.13.91 లక్షలు వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈ నెల 18న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

మనీలాండరింగ్ పేరుతో బెదిరించి.. 37 లక్షలు వసూలు 

బషీర్ బాగ్, వెలుగు: మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ పేరిట 74 ఏళ్ల వృద్ధురాలిని సైబర్ చీటర్స్ తాజాగా మోసగించారు. హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగినికి సైబర్ చీటర్స్ అంధేరి పోలీసుల పేరిట ఫోన్ చేశారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. ఆమె మొబైల్ నంబర్ నుంచి హరాస్​మెంట్​మెసేజెస్, ప్రకటనలు పంపుతున్నట్లు గుర్తించామన్నారు. 24 గంటల్లో ఆమె ఆధార్ తో లింక్ ఉన్న మొబైల్ నంబర్లను ట్రాయ్ డీయాక్టివేట్ చేస్తుందని బెదిరించారు.

అలాగే జెట్ ఎయిర్ వేస్ చైర్మన్ నరేశ్ గోయల్ కు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారంలో వృద్ధురాలి అకౌంట్ల నుంచి లావాదేవీలు జరిగినట్టు ఆర్బీఐ, సీబీఐ గుర్తించాయని నకిలీ లెటర్లను పంపించారు. ప్రస్తుతం నరేశ్ గోయల్ ను ఈడీ విచారిస్తున్నట్టు చెప్పారు. కేసు నుంచి బయటపడాలంటే ఆమె అకౌంట్లలో ఉన్న డబ్బును ఆర్బీఐ అకౌంట్ లో డిపాజిట్ చేయాలని, విచారణ తర్వాత వడ్డీతో సహా జమ అవుతుందని నమ్మించారు.

లేకపోతే అరెస్ట్​చేయాల్సి వస్తుందని బెదిరించారు. తమది సీక్రెట్ ఏజెన్సీ అని, విషయాన్ని ఎవరికీ చెప్పవద్దన్నారు. దీంతో భయపడిన వృద్ధురాలు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్, సేవింగ్స్​డబ్బుతో చేసుకున్న ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసి ఆర్టీజీఎస్​ద్వారా స్కామర్ అకౌంట్ లోకి రూ.37,90,000 ట్రాన్స్​ఫర్ చేసింది. తర్వాత కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో మోసపోయినట్టు వారు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

పోలీసులకుసమాచారం ఇవ్వాలి 

డిజిటల్ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోసాలను అరికట్టేందుకు దేశంలోని అన్ని ఏజెన్సీలతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కైప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియో కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే కాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భయపడకూడదు. పోలీసులు ఎప్పుడూ ఇలాంటి కాల్స్ చేయరు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఇంట్లో వారికి చెప్పాలి. బెదిరింపు కాల్స్ వస్తే కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలి. వెంటనే డయల్100, స్థానిక పోలీసులతో పాటు,1930కు సమాచారం అందించాలి. శిఖాగోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డైరెక్టర్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో