Cyber Crime: ఫ్రెండ్లా మాట్లాడి..హెల్త్ బాగోలేదని రూ.1.63 లక్షలు టోకరా

  • నిజామాబాద్ జిల్లా యువకుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

ధర్పల్లి, వెలుగు: ఫ్రెండ్కు హెల్త్ బాగోలేదని ఫోన్ చేసి రూ.1.63 లక్షలను సైబర్ ​నేరగాళ్ల అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆల స్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే..ఈ నెల1న  మధ్యాహ్నం 3 గం టల సమయంలో ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన అమ్రాద్​ ప్రశాంత్ కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 

అతని ఫ్రెండ్​రవి లెక్కనే మాట్లాడి, ఆస్పత్రిలో ఉన్నానని అర్జెంట్ గా రూ. 2 లక్షలు పంపమని కోరాడు. నిజమేనని నమ్మిన ప్రశాంత్ వెంటనే బ్యాంకుకు వెళ్లి తన వద్ద ఉన్న రూ. 1.63 లక్షలు పంపాడు. అనంతరం  ఫ్రెండ్ రవికి ఫోన్​ చేసి హెల్త్ ఎలా ఉందని, అమౌంట్ పంపానని చూసుకోమని తెలిపాడు.  

ఆరోగ్యం బాగానే ఉందని, డబ్బులు అడగలేదని, అకౌంట్​కు రాలేదని అతడు చెప్పడంతో ప్రశాంత్ అవాక్కైయ్యాడు. సైబర్​ నేరగాళ్లు మోసగించినట్టు తెలుసుకుని పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.