పార్వతీ బ్యారేజీకి సీడబ్ల్యూపీఆర్ఎస్​ నిపుణులు

పెద్దపల్లి :  మంథని మండలం సిరిపురం గ్రామంలోని పార్వతి బ్యారేజ్ నుసెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు సభ్యులు ఇవాళ సందర్శించారు. అలాగే సరస్వతి పంప్ హౌస్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక ఇంజినీరింగ్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సరస్వతీ పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి మోటార్లను పరిశీలించారు. కొన్ని ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పార్వతి బ్యారేజీ గేట్ల దగ్గరికి వెళ్లి 54 నుంచి 61 గేట్ల దగ్గర కుంగిపోయిన గార్డర్లను పరిశీలించారు. బ్యారేజ్ కింది భాగంలో జరుగుతున్న మరమ్మతు పనులు పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులు అడిగి వివరాలు సేకరించారు.