డివైడర్‌‌‌‌ను ఢీకొట్టిన బైక్‌‌‌‌, విద్యుత్ ఏఈ మృతి

బోధన్, వెలుగు : బైక్‌‌‌‌ అదుపుతప్పి డివైడర్‌‌‌‌ను ఢీకొట్టడంతో విద్యుత్‌‌‌‌ ఏఈ చనిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్‌‌‌‌ జిల్లా ఆటోనగర్‌‌‌‌ వద్ద గురువారం జరిగింది. బోధన్‌‌‌‌కు చెందిన రవిచంద్ర (45) బోధన్‌‌‌‌తో పాటు, ఎడపల్లి విద్యుత్‌‌‌‌ ఏఈగా పనిచేస్తున్నాడు. గురువారం ఎడపల్లిలో డ్యూటీ ముగించుకొని బైక్‌‌‌‌పై బోధన్‌‌‌‌ వస్తున్నాడు. ఆటో నగర్‌‌‌‌ సమీపంలోకి రాగానే బైక్‌‌‌‌ అదుపుతప్పి డివైడర్‌‌‌‌ను ఢీకొట్టింది. 

గమనించిన స్థానికులు విద్యుత్‌‌‌‌ శాఖ ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రవిచంద్రను నిజామాబాద్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ చనిపోయాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు బోధన్‌‌‌‌ పట్టణ సీఐ వీరయ్య తెలిపారు.

ట్రాక్టర్‌‌‌‌ పైనుంచి పడి జీపీ కార్మికుడు...

వేములవాడరూరల్, వెలుగు: చెత్త ట్రాక్టర్‌‌‌‌ పైనుంచి జారిపడి జీపీ కార్మికుడు చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌‌‌‌ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన గసికంటి పోచయ్య (60) గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం గ్రామంలో చెత్త సేకరణకు ట్రాక్టర్‌‌‌‌పై వెళ్తుండగా ట్రాక్టర్‌‌‌‌ ప్రమాదవశాత్తు విద్యుత్‌‌‌‌ పోల్‌‌‌‌కు ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌‌‌‌పై కూర్చున్న పోచయ్య కిందపడడంతో తలకు తీవ్ర గాయం అయింది. 

స్థానికులు సిరిసిల్లలోని హాస్పిటల్‌‌‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మారుతి చెప్పారు. కాగా మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా చెల్లించాలంటూ కార్మిక సంఘాల నాయకులు, కుటుంబసభ్యులు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. డీపీవో వీరబుచ్చయ్య, డీఎల్పీవో నరేశ్‌‌‌‌, ఎంపీడీవో శ్రీనివాస్‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌ సుజాత వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.