Health Tip : పెరుగు తింటే బరువు పెరగరు.. తగ్గుతారు..!

బరువు తగ్గాలని.. స్లిమ్ ఉండాలని చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. దాని కోసం కొంతమంది ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఇంకొందరు కడుపు మాడ్చుకుంటారు. కానీ అలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహారం ఎక్కువగా తీసుకోకపోయినా.. పోషకాలు ఉన్నవి కొద్ది మొత్తంలో తినడం చాలా మంచిది.

అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినొచ్చు. పెరుగు తింటే స్థూలకాయం వస్తుందని చాలా మంది అపోహ. కానీ అది పొరపాటని చాలా స్టడీల్లో తేలింది. ప్రతి రోజూ కప్పు పెరుగు తీసుకుంటే బరువు బాధ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే క్యాల్షియం శరీరంలోని కొవ్వును తగ్గించి స్లిమ్ గా ఉండేలా చేస్తుంది. పెరుగులోని ప్రొటీన్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి.

Also Read :- విటమిన్లు లోపించాయా.. అయితే ఇవి తినండి..

పెరుగును తరచూ తీసుకుంటే.. ఇతర చిరుతిండి తినలేరని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి పెరుగును తప్పకుండా డైట్ చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. బరువు కూడా పెరగరు.