పంట పండినా... దిగుబడి తగ్గినా రైతుకు కష్టాలు తప్పడం లేదు. పండితే ఒక రకం.. పండకపోతే మరో రకం ఇబ్బందులతో అన్నదాత సతమతమవుతున్నాడు. ప్రస్తుతం జీలకర్ర సాగు పెరిగి అధిక దిగుబడి వచ్చింది. కాని రేటు మాత్రం గతేడాది కంటే ఈ ఏడాది 31 శాతం తగ్గింది. దీనితో జీలకర్ర రైతులు లబో దిబో అంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు.
గుజరాత్‌లో జీలకర్ర ఉత్పత్తి బాగా పెరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్పైస్ స్టేక్‌హోల్డర్స్ అంచనాల ప్రకారం.. , గుజరాత్ , రాజస్థాన్ రాష్ట్రాల్లో జీలకర్ర ఉత్పత్తి గతేడాది కంటే దాదాపు 70 శాతం పెరిగి 5.6 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. జీలకర్ర పంట బాగా పండటంతో రానున్న రోజుల్లో జీలకర్ర ధర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గుజరాత్ లో జీలకర్ర పంట సాగు ఈ ఏడాది బాగా పెరిగింది. గతేడాది ( 2023) లో తక్కువ పంట పండటంతో జీలకర్ర ఎక్కువుగా ఉంది. ఈ ఏడాది సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా పెరగడంతో.. జీలకర్ర తగ్గుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ యార్డులకు ఈ ఏడాది ఏప్రిల్ 9 వరకు 54 వేల 487.74 మెట్రిక్ టన్నుల జీలకర్ర రాగా ... గత ఏడాది ఏప్రిల్ నాటికి 44 వేల 689.734 మెట్రిక్ టన్నులు మార్కెట్ యార్డులకు వచ్చింది.
ఉంజా మార్కెట్ యార్డులో జీలకర్ర ధర క్వింటాల్‌కు రూ.32 వేల గరిష్ట స్థాయికి చేరుకుందని సీనియర్ కమోడిటీ వ్యాపారి తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో రూ.42,000 బెంచ్‌మార్క్ ఉంటే... ఇది కనీసం 31 శాతం తక్కువ. ప్రస్తుతం ప్రతిరోజూ కనీసం 1000 నుంచి -1400 మెట్రిక్ టన్నులు జీలకర్ర యార్డుకు వస్తోందని ఊంఝా మార్కెట్ అధికారుల ద్వారా తెలుస్తోంది.
also read : శ్రీరామ నవమికి అయోధ్య రావొద్దు : ట్రస్ట్ పిలుపు
గుజరాత్‌లో జనవరి 8 వరకు జీలకర్ర సాగు విస్తీర్ణం 5.60 లక్షల హెక్టార్లు అని గత నెలలో ( మార్చిలో ) గుజరాత్ వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇది గతేడాది 2.75 లక్షల హెక్టార్ల కంటే 160 శాతం ఎక్కువ.. ఇదిలా ఉండగా... రాజస్థాన్‌లో జనవరి 8 వరకు 6.90 లక్షల హెక్టార్లలో జీలకర్ర సాగైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రాజస్థాన్ లో గత ఏడాదికంటే ఈ ఏడాది 25 శాతం ఎక్కువ సాగు చేయడంతో జీలకర్ర సాగు విస్తీర్ణం 12.50 లక్షల హెక్టార్లకు చేరుకుంది.
ఈ సంవత్సరం జీలకర్ర పంటను సాగు చేసే విస్తీర్ణం గతేడాది కంటే బాగా పెరిగింది. గతేడాది తక్కువ పంట పండటంతో జీలకర్ర ధర ఎక్కువుగా ఉంది. దీంతో రైతులు ఈ ఏడాది జీలకర్రను భారీగా సాగుచేశారు. ఈ ఏడాది బంపర్ దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే వాతావరణంలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ధరలు అదుపులోనే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.