రాజన్న ఆలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

  • వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ

వేములవాడ, వెలుగు :  తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ప్రతీకగా బతుకమ్మ  వేడుకలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా కొనసాగుతున్నాయి.  ఆదివారం రాజన్న ఆలయంలో మహిళలు బతుకమ్మ పాటలతో సందడి చేస్తూ కోలాటాలు ఆడి రాజన్న ఆలయ ధర్మగుండంలో నిమజ్జనం చేశారు. 

 కాగా రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజులకు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తుండగా.. వేములవాడలో మాత్రం ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. దీంతో రాష్ట్రంలో ఎవరికి దక్కని విధంగా రెండు చోట్ల బతుకమ్మ ఆడే అవకాశం ఇక్కడి మహిళలకు ఉంది. దీంతో వారంతా అటు పుట్టినింట్లో...మెట్టినింట్లో రెండు చోట్ల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.