కారులో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు.. మరి ల్యాప్​టాప్కు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే..

కారులో ఉండే డీసీ ఛార్జర్​తో ఫోన్లను ఛార్జ్​ చేసుకోవచ్చు. కానీ.. ల్యాప్​టాప్​లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఛార్జ్ చేయాలంటే 12వోల్ట్స్​ డీసీ పవర్‌‌ను 220 వోల్ట్స్​ ఏసీగా మార్చాలి. అలా మార్చాలంటే క్రస్ట్​ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ పోర్టబుల్​ ఇన్వెర్టర్ వాడాలి. దీన్ని 12వోల్ట్స్​ డీసీకి కనెక్ట్ చేయాలి. దీనికి 4 యూఎస్​బీ పోర్ట్‌‌లతోపాటు 3 ఏసీ ఔట్‌‌లెట్లు ఉంటాయి. అంటే ఒకేసారి 7 గాడ్జెట్స్​ ఛార్జ్ చేసుకోవచ్చు.

కాకపోతే.. అన్నింటికీ కలిపి 200 వాట్స్​ మాత్రమే అందించగలదు. ఇందులో షార్ట్ సర్క్యూట్, ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్​ కూడా ఉంది. ఇంటిగ్రేటెడ్ టెంపరేచర్- కంట్రోల్​ కూలింగ్ ఫ్యాన్ వల్ల ఇది ఎక్కువగా వేడెక్కదు.

ధర : 1,799 రూపాయలు