క్రౌడ్ స్ట్రయిక్ వల్లే మైక్రోసాఫ్ట్ ఢమాల్.. ప్రపంచం అల్లకల్లోలానికి ఇదీ కారణం..!

ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ పని చేయకపోవటం వల్ల.. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, ఎయిర్ లైన్స్, ఈ కామర్స్ బిజినెస్, బ్యాంకింగ్.. బ్రాడ్ కాస్టింగ్ మీడియా, స్టాక్ మార్కెట్ వంటి సంస్థల్లో సర్వీసులు అన్నీ ఆగిపోయాయి.. అసలు ఎందుకు ఇలా జరిగింది.. కారణం ఏంటీ అనేది వివరంగా చూద్దాం..

క్రౌడ్ స్ట్రయిక్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వల్లే :

క్రౌడ్ స్ట్రయిక్.. ఇది సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్. క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ అందించే సంస్థ. మైక్రోసాఫ్ట్ కు బ్యాకెండ్ వర్క్ చేస్తుంది. ఈ క్రౌడ్ స్ట్రయిక్ సంస్థ.. క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించి.. కొత్త అప్ డేట్ చేసింది. ఈ అప్ డేట్ వెర్షన్ అనేది నెగెటివ్ రిజల్ట్ ఇచ్చింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టంతో క్రౌడ్ స్ట్రయిక్ సెక్యూరిటీ టెక్నాలజీ కలిసి పని చేస్తుండటంతో.. క్రౌడ్ స్ట్రయిక్ నెగెటివ్ ఇంపాక్ట్.. మైక్రోసాఫ్ట్ పై పడింది. దీంతో కౌడ్ స్ట్రయిక్ టెక్నాలజీతో లింక్ అయిన మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్స్ అన్నీ కుప్పకూలాయి. ఈ విషయాన్ని గుర్తించిన క్రౌడ్ స్ట్రయిక్ సంస్థ ఐటీ నిపుణులు.. అప్ డేట్ వెర్షన్ లో వచ్చిన తప్పును.. సరిచేయటానికి ప్రయత్నిస్తున్నారు. క్రౌడ్ స్ట్రయిక్ టెక్నాలజీ ముఖ్యంగా స్కానింగ్.. అంటే క్యూఆర్ కోడ్ రీడింగ్.. క్లౌడ్ లో సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీపై పని చేస్తుంది.

ఇప్పుడు మనం ఏం చేయాలి :

>>>  మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ క్లౌడ్ సిస్టం కింద పని చేస్తున్న అందరికీ.. వారి వారి కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ వస్తుంది. అలా బ్లూ స్క్రీన్ వచ్చిన వారందరూ ఏమీ చేయొద్దు.. దాన్ని అలాగే వదిలేయండి.. క్రౌడ్ స్ట్రయిక్, మైక్రోసాఫ్ట్ కంపెనీల నుంచి సమాచారం వచ్చే వరకు వెయిట్ చేయాలి అని కంపెనీలు ప్రకటించాయి. 

>>> ఎఫెక్ట్ అయిన సంస్థలకు తాత్కాలిక సేవలు అందించేందుకు.. మైక్రోసాఫ్ట్ ఆన్ లైన్ లింక్ విడుదల చేసింది. అందులో వచ్చే అప్ డేట్స్ ఆధారంగా ఆయా కంపెనీల్లో ఐటీ నిపుణులు పని చేయాల్సి ఉంది. 

>>> ప్రస్తుతం ఉన్న సమస్య పరిష్కారం కావటానికి చాలా సమయం పట్టొచ్చు. ఎవరూ ఆందోళన చెందొద్దు.. టెక్ నిపుణులు అందరూ అదే పని ఉన్నారు. కొత్త అప్ డేట్స్ వచ్చిన తర్వాత వెంటనే చెబుతాం అంటూ క్రౌడ్ స్ట్రయిక్, మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 

>>> బ్లూ స్క్రీన్ వచ్చిన కంప్యూటర్లను సొంతంగా రిపేర్ చేసే ఉద్దేశాన్ని మానుకోవాలి.. హార్డ్ డిస్క్ లు మార్చొద్దు.. రీబూట్ చేయొద్దు అని స్పష్టంగా ప్రకటించింది మైక్రోసాఫ్ట్. 

ఏయే రంగాలు ఎఫెక్ట్ :

>>> క్రౌడ్ స్ట్రయిన్ బగ్ ఫెయిల్ వల్ల మైక్రోసాఫ్ట్ సేవలకు బ్రేక్ పడింది. దీని వల్ల లండన్ కేంద్రంగా పని చేస్తున్న స్కై న్యూస్ టెలివిజన్ ఛానెల్.. ఉదయం పూట లైవ్ టెలికాస్ట్ చేయలేకపోయింది.
>>> ఆస్ట్రేలియా దేశ వ్యాప్తంగా ఎక్కడి విమానాలు అక్కడే ఆగిపోయాయి. గ్రౌండ్ జీరో. అంటే ఆస్ట్రేలియా దేశం నుంచి ఏ ఒక్క విమానం గాల్లోకి ఎగరలేదు. 
>>> ఆస్ట్రేలియా దేశ వ్యాప్తంగా బ్యాంకులు పని చేయటం లేదు.
>>> అమెరికాలోని కొన్ని ఎయిర్ పోర్టుల్లో విమాన సర్వీసులు రద్దు చేశారు. 
>>> జర్మనీ స్టాక్ మార్కెట్ లో లావాదేవీలకు బ్రేక్ పడింది.
>>> బెర్లిన్ ఎయిర్ పోర్టులో గంటకొద్దీ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
>>> ఇండియాలో ఇండిగో, స్పైస్ జెట్, ఆకాసా ఎయిర్ లైన్స్ సర్వీసుల్లో కొన్ని రద్దు.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
>>> యూరప్, ఇండియా, అమెరికాలోని చాలా విమానాశ్రయాల్లో సైన్ బోర్డులు పని చేయలేకపోవటంతో.. మ్యాన్యువల్ గా బోర్డులపై విమానాల రాకపోకల వివరాలు రాస్తున్నారు.

మొత్తంగా మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రయిక్ లో తలెత్తిన సమస్య అనేది చిన్నదిగా లేదని మాత్రం రెండు కంపెనీలు ప్రకటించటం.. సమస్య తీవ్రతను స్పష్టం చేస్తుంది. క్రౌడ్ స్ట్రయిక్ తన సమస్యను పరిష్కరించినా.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల సంఖ్యలోని కంప్యూటర్లను మ్యాన్యువల్ గా అప్ డేట్ చేయాల్సి అవసరం వస్తుందా లేక ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారం అవుతుందా అనేది కూడా ఇప్పటికీ ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.