కొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే హనుమాన్ దీక్షాపరులు గుట్టకు చేరుకొని కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ దీక్షపరులు పెద్ద సంఖ్యలో గుట్టకు చేరుకోవడంతో ఆలయ పరిసరాలు రామాంజనేయ నామస్మరణతో మారుమోగాయి. బొజ్జ పోతన ఆలయం వరకు ట్రాఫిక్ జామ్ అయింది.

హనుమాన్‌‌ పెద్దజయంతి సందర్భంగా సుమారు 25వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ధర్మ దర్శనానికి భక్తులకు సుమారు 2 గంటలకు పైగా పట్టింది. ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్‌‌ సునీల్ భక్తులకు ఏర్పాట్లు పర్యవేక్షించారు. _కొండగట్టు, వెలుగు