నల్గొండ, యాదాద్రి : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తలు తెల్లవారిజామునుంచే స్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం, స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
సాధారణంగానే యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి ఉంటుంది. ఆందులోనూ ఆదివారం కావడం, సెలవుదినం కావడంతో భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. భక్తుల తాకిడి దృష్ట్యా అధికారులు దర్శనం నుంచి మొదలు.. లడ్డూ ప్రసాదాల విక్రయాల వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సన్నాహాకాలు చేశారు.