బోధన్, సాలూర మండలాల్లో 300 ఎకరాల్లో పంట నష్టం ​

  • రైతులను ఆదుకోవాలి

బోధన్, వెలుగు: బోధన్​, సాలూర  మండలాల్లో సోమవారం రాత్రి కురిసిన వడగండ్లు అకాల వర్షానికి 300 ఎకరాల్లో వరిపంట నష్టం జరిగినట్లు మండల అగ్రికల్చర్​ ఆఫీసర్ సంతోష్​ నాయక్ తెలిపారు. వరిపంటతోపాటు మందర్నా,హున్సాలోని మామిడి కాయలు రాలిపోయాయి.  మండలంలోని మందర్నా, హున్సా, ఖజాపూర్​,  కుమ్మన్​పల్లి, సాలంపాడ్​, పెంటకుర్దు, పెంటక్యాంప్​ గ్రామాల్లో వరి పంట 60 శాతం నష్టపోయినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు.  

చేతికి వచ్చిన పంట అకాలవర్షానికి  నేలమట్టం కావడంతో ఎకరానికి రూ.30 వేలు నష్టం వాటిల్లినట్లు  రైతులు వాపోయారు.  అగ్రికల్చర్​ అధికారులు సర్వేచేసి పంటనష్టపరిహారం అందించాలని డిమాండ్​ చేస్తున్నారు.  మందర్నా, పెంటకుర్దు గ్రామాల్లో అగ్రికల్చర్​ ఏఈవోలు, రైతులు, స్థానిక నాయకులు పంటలను పరిశీలించారు.   కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో నష్టం పెరిగినట్లు పేర్కొన్నారు.