పులిచింతల బ్రిడ్జిపైకి మొసలి

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు బ్రిడ్జిపై బుధవారం రాత్రి మొసలి కలకలం రేపింది. రాత్రి సమయంలో బ్రిడ్జిపై వెళ్తున్న వాహనదారులకు మొసలి కనబడటంతో ఆశ్చర్యపోయారు. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇటీవల మునగాల వద్ద, చిలుకూరు వద్ద కూడా భారీ మొసలి కనిపించిందని అదే మొసలి పులిచింతల నీటిలోకి చేరి ఉండవచ్చని ఇన్ చార్జ్ ఎఫ్ఆర్వో ప్రేమజ్యోతి తెలిపారు.ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.